పవన్‌ దర్శకుడి చేతుల మీదుగా 'అల్లంత దూరానా'..!

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం అల్లంత దూరాన.ఈ సినిమాలో హీరోయిన్‌ గా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది.

 Pawan And Chiranjeevi Director Baby Lunch Allanta Durana Movie Motion Poster , A-TeluguStop.com

చలపతి పువ్వల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఆర్.

ఆర్.ఆర్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్.రవీంద్ర) విడుదల చేశారు.పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్‌ సినిమాను చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం చిరంజీవితో సినిమాకు రెడీ అవుతున్నాడు.అలాంటి ప్రముఖ దర్శకుడు బాబీ అల్లంత దూరానా సినిమా మోషన్‌ పోస్టర్ ను విడుదల చేయడంతో సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telugu Allanta Durana, Baby, Telugu-Movie

ఈ సందర్బంగా బాబి మాట్లాడుతూ, “మోషన్ పోస్టర్ చాలా బావుంది.మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది.దర్శక, నిర్మాతలతో పాటు చిత్రబృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు.ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చూసిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చాలా బావుందంటూ ప్రశంసిస్తూ.

చితబృందానికి శుభాశీస్సులు అందజేశారు.చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, “ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిది.

నాకు స్ఫూర్తిని కలిగించిన దర్శకులలో బాబి గారు ఒకరు.ఆయన చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల కావడం ఆనందంగా ఉంది.

మా మోషన్ పోస్టర్ ను చూసి అభినందించిన భరద్వాజ గారికి కృతజ్ఞతలు” అని అన్నారు.హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ , “జమ్మూకాశ్మీర్ షూటింగ్ లో ఉన్న కారణంగా నేను మోషన్ పోస్టర్ విడుదలకు హాజరు కాలేకపోయాను అంటూ ఓ వీడియో విజువల్ ను షేర్ చేశారు.

లోగడ ఇదే దర్శకుడితో “కళాపోషకులు” చిత్రాన్ని చేశాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube