బిడెన్ ఫెయిల్యూర్...ట్రంప్ బెస్ట్ అంటున్న అమెరికన్స్...మీడియా చెప్పని నిజాలు ఏంటి..??

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీచ్యుతుడు అవడానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి.సరిగ్గా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ విజయం ఖాయమనుకున్న తరుణంలో ఎవరో చెప్పినట్టుగా వచ్చిన కరోనా మహమ్మారి ట్రంప్ ను అమెరికా ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది ఫలితంగానే ట్రంప్ అధ్యక్ష పదవి పోగొట్టుకున్నారు.

 Americans Praises Donald Trump, Us President, Joe Biden Failure, Covid Vaccine,-TeluguStop.com

నేను అధికారంలో ఉండి ఉంటే ఇంత మంది అమెరికన్స్ చనిపోయేవారు కాదని, అమెరికన్స్ ను ట్రంప్ పొట్టన బెట్టుకున్నాడని, అధికారంలోకి వస్తే పొడిచేస్తా, అదిచేస్తా , ఇది చేస్తా అన్న బిడెన్ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చేతులు ఎత్తేశారు.

కరోనా మహమ్మారిని అమెరికా నుంచీ దూరంగా తరిమి కొట్టలేని ట్రంప్ అధ్యక్షుడిగా అవసరమా, ప్రజలకు వైద్య సదుపాయాలూ లేవు, బెడ్స్ లేవు ఇదేమి ఘోరం అంటూ ఆవేదన వ్యక్తం చేసి ట్రంప్ ను అసమర్ధ అధ్యక్షుడిగా, అమెరికాను వందేళ్ళ వెనక్కి తీసుకువెళ్ళిన అధ్యక్షుడిగా చిత్రీకరించారు బిడెన్.

కానీ ప్రస్తుతం అమెరికా ప్రజలు బిడెన్ కంటే ట్రంప్ వెయ్యి రెట్లు బెటర్ అంటున్నారట.అంతేకాదు ట్రంప్ చూపించే చొరవ, సాహసం బిడెన్ ఏ మాత్రం ప్రదర్శించలేరని విమర్శలు కూడా చేస్తున్నారట.అయితే అందుకు కారణం లేకపోలేదు

Telugu Afghanistan, Americans, Biden Afghans, Corona, Covid Vaccine-Telugu NRI

అమెరికాలో కరోన మొదటి వేవ్ కంటే కూడా మూడవ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.వ్యాక్సినేషన్ కూడా కేవలం 50 శాతం మంది ప్రజలకు మాత్రమే జరిగిందని, ఇక ప్రధానంగా ప్రతీ రోజు లక్షకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయని , మరీ ముఖ్యంగా అమెరికాలో 90 శాతం హాస్పటల్స్ లోని బెడ్స్ నిండుకోవడంతో, బెడ్స్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, సకాలంలో వైద్య సదుపాయాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.తాజా పరిస్థితులతో పోల్చుకుంటే మొదటి వేవ్ సమయంలో ట్రంప్ ఇలాంటి పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కున్నారని బిడెన్ ఎలాంటి చర్యలు చేపట్టలేక పోతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారట.ఇదిలాఉంటే

అమెరికాలో ప్రస్తుత పరిస్థితులను మీడియా సైతం బయటపెట్టక పోవడం ఎంతో దారుణమని, ట్రంప్ హయాంలో బెడ్స్ లేవని గగ్గోలు పెట్టిన మీడియా ఇప్పుడు బిడెన్ హయాంలో బెడ్స్ లేకపోగా వైద్య సయం సరిగా అందకపోతుంటే ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బిడెన్ వ్యాక్సిన్ పై దృష్టి పెట్టినా అది కూడా సరిగా అమలు కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు పరిశీలకులు.అలాగే ఆఫ్ఘాన్ విషయంలో బిడెన్ నిర్ణయం కూడా తమను విస్మయానికి గురిచేసిందని, ప్రపంచం ముందు అమెరికా చిన్నబోయెలా చేశారంటూ బిడెన్ తీరుపై అమెరికన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube