దోష‌లు వేయ‌డంలో ఇత‌ని స్పీడ్ చూస్తే ఏ రోబో కూడా ప‌నిచేయ‌దేమో..

ఇండియాలో ఉన్న మిగ‌తా పారిశ్రామిక వేత్త‌లంద‌రికంటే కూడా ఆనంద్​ మహీంద్రా చాలా డిఫ‌రెంట్ గా ఉంటారు.ఎందుకంటే నిత్యం ఆయ‌న సోషల్ మీడియాలో ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి స్పూర్తిదాయకమైన లేదంటే ఆశ్చ‌ర్య‌ప‌రిచే వీడియోల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్​గా ఉంటారు.

 If You Look At His Speed In Making Mistakes, What Robot Would Work, Anand Mahind-TeluguStop.com

నెటిజన్లకు తెలియ‌న‌టువంటి కొత్త, కొత్త విషయాలు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియ‌జేస్తూ ఉంటారు ఆయ‌న‌.ఇక ఇప్పుడు కూడా ఆనంద్​ మహీంద్రా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను త‌న ట్విట్టర్​ ఖాతా వేదిక‌గా పంచుకున్నారు.

అది కూడా ఒక స్ట్రీట్ వెండర్​ కు సంబంధించిన‌దే.

ఈ వీడియోలో చూస్తే త‌మిళ‌నాడుకు చెందిన ఓ చెఫ్ మాస్ట‌ర్ రోడ్డుసైడులో రోబోట్​ లాగా చకచకా దోశలు తయారు చేస్తున్న సీన్ మ‌న‌కు క‌నిపిస్తుంది.

నిజంగా ఆ మాస్ట‌ర్ దోష‌లు వేస్తున్న వేగం చూస్తే త‌న‌కు ఆశ్చర్యం క‌లిగింద‌ని మహీంద్రా పేర్కొన్నారు.మ‌రి ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేస్తే వైర‌ల్ కాకుండా ఉంటుందా చెప్పండి.

నిముషాల్లోనే ట్రెండిగ్‌లోకి వ‌చ్చేసింది.దాదాపు ఆ వీడియో 28 సెకన్ల పాటు ఉంది.

ఇక ఇందులో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి త‌న ముందున్న పెనం మీద ఎంతో నైపుణ్యంతో కూడిన దోశలు వేయడాన్ని చూడొచ్చు.

ఇంకో విష‌యం ఏంటంటే ఆ వ్య‌క్తి ఎంత చ‌క‌చ‌కా దోష‌లు వేస్తున్నాడో అంతే ఫాస్ట్ గా వాటిని కస్టమర్లకు సర్వ్​ చేయడం క‌నిపిస్తోంది.దోశ కాల‌గానే దాన్ని మడిచి మెరుపు వేగంతో దాన్ని ముక్కలుగా కోసి ఓ ప్లేట్​లో దాన్ని మార్చేసి ర‌జినీ స్టైల్ లో దాన్ని విసిరేయ‌డాన్ని కూడా చూడొచ్చు.అత‌డి స్టైల్ చూస్తుంటే నిజంగానే రోబోలాగా పని చేస్తున్నాడ‌ని అనిపించ‌క‌మాన‌దేమో.

ఇక ఆ జెంటిల్ మెన్ ప‌నితీరుకు తాను నిజంగానే మంత్రముగ్ధుడినయ్యాన‌ని, ఆ దోశల్ని చూడగానే ఆకలి వే్తోంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చారు ఆనంద్​ మహీంద్రా.ఇక ఇది చూసిన నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube