దేవుడా: 'ట్విట్టర్ పక్షి వేపుడు'.. ఎక్కడో తెలుసా..?!

సోషల్ మీడియాలో భాగంగా చాలామంది ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ ను ఉపయోగిస్తున్నారు.తాము ఏదన్నా చెప్పాలంటే ఆ విషయాన్నీ ట్వీట్ రూపంలో విడుదల చేస్తున్నారు.

 Ap, Cong Workers ,‘twitter Bird’, Protest Blocking, Raga’s Account,latest-TeluguStop.com

ఆ న్యూస్ కాస్త క్షణాల్లో వైరల్ అయిపోతుంది.సెలెబ్రిటీల దగ్గర నుండి సామాన్యుల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ అకౌంట్ ను వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలో ట్విట్టర్ కి సంభందించిన ఒక న్యూస్ వైరల్ అయింది.మీరు ఎప్పుడన్నా ట్విట్టర్ పిట్ట వేపుడు గురించి విన్నారా.? అలా ట్విట్టర్ పిట్ట ఫ్రై చేసి ఏకంగా పార్సిల్ లో ఢిల్లీకి పంపారు.ఏంటి.? ట్విట్టర్ పిట్ట వేపుడేంటి.డీల్లికి పార్సిల్ ఏంటి అని షాక్ అవుతున్నారా.! అసలు వివరాల్లోకి వెళితే.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ఒక దళిత బాలిక అత్యాచారానికి గురైన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఆ దళిత బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు.వాటికి సంబందించిన కొన్ని ఫోటోలను ఆయన తన ట్విట్టర్‌ లో అప్లోడ్ చేసిన కారణంగా కాంగ్రెస్ నేత అయిన రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌ ను ఆ సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీ తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆయన ఖాతాను బ్లాక్ చేశామని సంస్థ వివరణ ఇచ్చింది.అలాగే రాహుల్ గాంధీ ట్విట్టర్ బ్లాక్ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీనే అధికారికంగా ప్రకటించింది.

ఇలా తమ నేత ట్విట్టర్ బ్లాక్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రు మంటున్నారు.ఇలా చేయడం సరికాదని వాపోయారు.వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మండిపడుతున్నారు.

Telugu Bird, Cong, Ragas-Latest News - Telugu

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒక సరికొత్త నిరసన ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ నేత హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్, అతని అనుచరులు కలిసి ట్విట్టర్ పిట్ట వేపుడు చేసి ఢిల్లీలోని ట్విట్టర్ ఇండియా హెడ్ క్వార్టర్స్‌ కు పార్శిల్ చేయబోతున్నట్లు తేలిపారు.ఒక పొయ్యి పెట్టి అందులో నూనె పోసి ఉప్పు కారం పట్టించిన ఒక పిట్టను నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో పెట్టి కొరియర్ కవర్ లో పెట్టి ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు.

అలాగే బీజేపీ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేసారు.తమ పార్టీ అధినేత ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడం సరికాదని, బీజేపీ పార్టీ నేతలు కుట్ర పుర్వితంగానే కాంగ్రేస్ నేతల ట్విట్టర్ లను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం ఈ ట్విట్టర్ పిట్ట వేపుడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube