శరీరంలోకి ఆరడుగుల ఇనుప రాడ్.. అయినా కానీ..?!

రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ ఉండాలి.

 Six Foot Iron Rod Into The Body .. But But  Viral Latest, Viral News, Social Med-TeluguStop.com

ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి.ముఖ్యంగా అతి వేగం ప్రమాదకరం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ అతివేగమే ఒక వ్యక్తి ప్రాణాల మీదకి తెచ్చింది.మనకు చిన్న సూది గుచ్చుకుని రక్తం కారితేనే అల్లాడిపోతాము కదా.కానీ ఈ వ్యక్తికి ఒక ఆరడుగుల ఇనుప రాడ్ ఛాతిలో దిగబడిపోయింది.దాదాపు చావు అంచులు దాక వెళ్ళాడు.

ఎక్కడో అదృష్టం బాగుండి, డాక్టర్స్ చేసిన కృషి వలన బతికి బయట పడ్డాడు.వివరాల్లోకి వెలితే.

పంజాబ్ రాష్ట్రంలోని బతిండాలోని లెహ్రా గ్రామంలో బైక్ పై పోతున్న హర్దీప్ అనే వ్యక్తి ఉన్నటుండి కాస్త వేగం పెంచాడు.అలా వేగంతో బైక్ డ్రైవ్ చేసే క్రమంలో రోడ్డుపై ఉన్న ఇసుక గుట్టను గమనించలేదు.

వేగంగా వస్తున్న బండి ఇసుకకు తగలడంతో బైక్ టైర్ పక్కకు ఒరిగి బైక్ మీద నుంచి జారి రోడ్డు పక్కన పడిపోయాడు.

Telugu Iron Rod, Punjab, Latest-Latest News - Telugu

అదే సమయంలో అక్కడ ఒక ఆరడుగుల ఇనుప రాడ్డు ఉండడంతో అది అతని ఛాతీలోకి దిగబడిపోయింది.అసలు ఏమి జరిగిందని ఆలోచించే లోపే ఈ ఘోరం జరిగిపోయింది. రక్తం ఏరులయి పారుతుంది.

ఒక్కసారిగా ఒంట్లో దిగబడిన రాడ్, కారుతున్న రక్తం చుసి మైండ్ బ్లాక్ అయినంత పనయింది అతనికి.దాంతో అక్కడ ఉన్న కొంతమంది కుర్రాళ్లు అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

అతని కండిషన్ చూసిన డాక్టర్లు ఏమి ఆలోచించకుండా వెంటనే ఆపరేషన్ చేయడానికి రెడీ అయ్యారు.మొత్తం ఆరుగురు డాక్టర్లు 21 మంది పారామెడికోలు కలిసి సుమారు 5 గంటలపాటూ కష్టపడి మొత్తానికి అతని శరీరంలో ఉన్న రాడ్డును బయటకు తీసి కుట్లు వేసి హర్దీప్ ను బతికించారు.

హర్దీప్ బతికిన విషయం తెలిసి అక్కడ ఆస్పత్రిలో ఉన్నవారు అందరు సంతోషపడ్డారు.

Telugu Iron Rod, Punjab, Latest-Latest News - Telugu

ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన సర్జన్ డాక్టర్ సందీప్ ధండ్ మాట్లాడుతూ ఆ రాడ్డు అతని గుండెకు ఈ మాత్రం టచ్ అవ్వలేదు.ఒకవేళ అది కొద్దిగా తగిలినా అక్కడిక్కడే అతను చనిపోయేవాడని అన్నారు.ఇంకో విచిత్రం ఏంటంటే ఆస్పత్రికి వచ్చాక హర్దీప్ లో బతకాలనే కోరిక రెట్టింపు అయింది.

అతని మనోబలమే అతన్ని కాపాడింది.అయితే ఆపరేషన్ సమయంలో చాలా రక్తం పోయిందట.

నిజానికి అంత రక్తం పోతే మనిషి బతకడమే చాలా కష్టం.కానీ హర్దీప్ విషయంలో అలా జరగలేదు.

నిజంగా ఇదంతా ఒక మాయలాగా ఉందని డాక్టర్లు అంటున్నారు.ఏది ఏమయినా హర్దీప్ ను నిజంగా బతికించింది మాత్రం వైద్యులే.

నిరంతరం రక్తం కారుతున్నాగాని లెక్క చేయకుండా ఆపరేషన్ చేసి ఒక మనిషి ప్రాణం కాపాడి అందరి ప్రశంసలు పొందారు.అలాగే తనకి పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు హార్ధిప్ కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube