ఏపీ లో ముందస్తు ఎన్నికలు ? ప్లాన్ ఏంటంటే ?

మొన్నటి వరకు స్నేహంగానే ఉన్నట్టు గా వ్యవహరించిన బిజెపి, ఇప్పుడు వైసీపీ విషయంలో చాలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా, ముందు ముందు ఏపీలో తమకు ఇబ్బందులు తలెత్తకుండా బిజెపి ముందుగానే ఇబ్బందులకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

 The Bjp Is Planning Early Elections In The Ap Ap, Tdp, Chandrababu, Jagan, Ysrcp-TeluguStop.com

ఏపీ లో బలంగా పాతుకుపోయిన వైసీపీని బలహీనం చేయడం ద్వారా, తమ రాజకీయ ఎత్తుగడకు పదును పెట్టే ఆలోచనలో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తుంది.ప్రస్తుతం 151 సీట్ల తో ఎమ్మెల్యేలు, జనసేన నుంచి మద్దతు ఇస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తో జగన్ ప్రభుత్వం బలంగా ఉంది.

దీంతో జగన్ ను దెబ్బ కొట్టేందుకు బిజెపి పెద్ద ప్లాన్ తోనే వ్యవహరిస్తోంది.
      ఇప్పటికే ఏపీ కి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది.

ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు.ఇక రాబోయే రోజుల్లో కేంద్రం మద్దతు జగన్ కు ఉండదు అనే విధంగా సంకేతాలు ఇచ్చారు.

అయినా జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోవడంతో,  ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీని విధించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇలా చేస్తేనే జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడి,  పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అభాసుపాలు అవుతుందని, జనాల్లో వైసిపి గ్రాఫ్ అమాంతం గా తగ్గిపోతుందని, జనాల్లో పెరిగిన అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలనే ఒత్తిడి జగన్ పై వస్తుందని, బిజెపి పెద్దలు అభిప్రాయపడుతున్నారట.
 

Telugu Bjp Central, Chandrababu, Jagan, Modhi, Ysrcp-Telugu Political News

    అప్పట్లోగా  ఏపీలో బీజేపీ, జనసేన బలోపేతం అయ్యేవిధంగా తగిన వ్యూహాలు రూపొందించుకోబోతున్నట్టు సమాచారం.ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ , ముందస్తు ఎన్నికల ప్లాన్ తోనే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ప్రాధాన్యం ఇస్తూ, బీజేపీ అగ్రనేతలతో అపాయింట్మెంట్ ఇస్తూ, వైసీపీ ప్రభుత్వం పై ఎదురుదాడి చేయిస్తున్నారు అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube