ద‌ళిత బంధుతో తెర‌మీద‌కు రావాల‌ని చూస్తున్న క‌డియం.. గురి మామూలుగా లేదుగా

కేసీఆర్ అంటే కాస్త ప‌ట్టుద‌ల ఉన్న వ్య‌క్తిగా పేరున్నారు.ఆయ‌న ఎవ‌రు చెప్పినా స‌రిగ్గా వినిపించుకోర‌న‌, చివ‌ర‌కు ప్ర‌త్య‌ర్థులు సైతం ఆయ‌న మాట‌లు వినేలా చేసుకుంటార‌నే పేరు కేసీఆర్‌కు ఉంది.

 Kadium Is Looking To Come On Screen With A Dalit Relativ Not As Usual, Kadium S-TeluguStop.com

ఇక సొంత పార్టీ నేత‌ల‌యితే కేసీఆర్ ఏది చెబితే అదే చేయ‌డం త‌ప్ప వేరే మార్గ‌మే లేదు వారికి.ఇక కేసీఆర్ ఎవ‌రికి ప‌ద‌వులు ఇచ్చినా, ఎవ‌రికి ఇవ్వ‌కున్నా ఇష్టం ఉన్న వారు పార్టీలో ఉంటారు లేదంటే పార్టీని వీడ‌ట‌మో కామ‌న్‌గానే జ‌రిగిపోతుంటాయి.

ఇక ఇదే క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి కూడా వ‌స్తున్నారు.

ఆయ‌న్ను ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌క్క‌న పెట్టేసిన కేసీఆర్ కాస్త‌.

ఆయ‌న్ను చాలా రోజులుగా కొంత దూరంగానే ఉంచుతున్నారు.ఇక కేసీఆర్‌ను బుజ్జ‌గించి లాభం లేద‌నుకున్నాడో ఏమో గానీ ఇప్పుడు కడియం కూడా కాస్త ధిక్కార స్వరాన్ని వినిపించే ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు ద‌ళిత జాతి ప్ర‌యోజ‌నాల కోసం ద‌ళిత‌బంధు స్కీమ్ ను ప్ర‌వేశ‌పెడుతున్న కేసీఆర్ దృష్టిలో ప‌డేందుకు ట్రై చేస్తున్నారు.

Telugu Dalitha Bandu, Kadium Srihari, Tg-Telugu Political News

ఇక కేసీఆర్ ప్ర‌వేశ పెట్టిన ద‌ళిత బంధుపై ఆయ‌న ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ద‌ళిత బంధు ఏ మాత్రం తేడా వ‌చ్చినా చివ‌ర‌కు బెడిసి కొడుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.అంటే చివ‌ర‌కు ఆయ‌న్నుప‌ట్టించుకోక‌పోతే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తార‌ని బెదిరింపు ధోర‌ణిలోకి మారిన‌ట్టు తెలుస్తోంది.అయితే క‌డియం కూడా ద‌ళితుడే కావ‌డంతో ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డంలో కేసీఆర్ కొంత వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టే తెలుస్తోంది.

ఇక కేసీఆర్ కూడా క‌డియంను చాలా రోజులుగా దూరంగానే పెడుతున్నారు.మ‌రి క‌డియం ఈ విధంగా ద‌ళిత‌బంధుతో త‌న‌ను కేసీఆర్ ద‌గ్గ‌ర తీసుకునేలా రాజ‌కీయం చేస్తున్నారా లేక బెదిరింపు ధోర‌ణికి దిగుతున్నారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube