కువైట్ లోని ప్రవాస భారతీయులకు కేంద్రం ఆర్ధిక సాయం..వారికి మాత్రమేనట..!!

కరోనా వలన ఎంతో మంది తమ కుటుంభ సభ్యులను పోగొట్టుకున్నారు.లక్షలాది మంది రోడ్డున పడ్డారు.

 Kuwait Ambassador Sibi George Announces 1lakh To Nris Who Died With Covid, Kuwai-TeluguStop.com

అగ్ర రాజ్యంలో అయితే శవాలు కుప్పలు తెప్పలుగా స్మశానంలో దర్సన మిచ్చాయి.ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారంది.

ఒక పక్క కుటుంభ పెద్ద లేకపోవడం మరో పక్క వారి ఆర్ధిక పరిస్థితి ఇలా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు కొందరు.కేవలం అగ్ర రాజ్యంలో మాత్రమే కాదు దాదాపు అన్ని దేశాలలో ప్రజల పరిస్థితి ఇలానే ఉంది.

భారత్ నుంచీ వివిధ దేశాలకు వెళ్ళిన భారతీయులకు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో అక్కడి పలు ప్రవాస సంఘాలు సాయం అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే

కువైట్ వంటి దేశంలో ఉంటూ కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రవాస భారతీయులకు కువైట్ లోని భారత రాయభారి సిబీ జార్జ్ కీలక ప్రకటన చేశారు.

భారత 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాసీయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కరోనా కారణంగా కుటుంభ సభ్యులను కోల్పోయిన వారికి రూ.లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి కుటుంభాలకు నేరుగా ఈ సాయం అందుతుందని స్పష్టం చేశారు.

Telugu Ambassadorsibi, Corona, Covid, Indians Kuwait, Kuwait, Taskforce-Telugu N

కువైట్ లో ఎంత మంది ప్రవాసీయులు ఉన్నారు, ఎంత మంది కరోనా కారణంగా కుటుంభ సభ్యులను కోల్పోయారు అనే వివరాలను తెలుసుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ ఇప్పటికే దాదాపు 65 కుటుంభాలను గుర్తించిందని సిబీ ప్రకటించారు.ఒక్కో కుటుంభానికి రూ.లక్ష సాయం అందిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.అయితే ఈ సాయం పెద్ద మొత్తం కాకపోయినా ఎంతో కొంత వారి కుటుంభానికి ఉపయోగపడుతుందని సిబీ తెలిపారు.

త్వరలో కమిటీ ప్రకటించే మరిన్ని కుటుంభాలకు సాయం అందిస్తామని తెలిపారు.ఇదిలాఉంటే 120 కువైట్ దిన్హార్ల కంటే తక్కువ జీతం ఉండి కువైట్ లో మృతి చెందిన వారికి మాత్రమే ఈ సాయం అందిస్తామని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube