బిడెన్ ఇది విన్నారా....ఆందోళన చెందితే సరిపోదు...!!!

అమెరికాలో ఆసియన్ల పై దాడులు.ఈ మాట గడిచిన కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది.

 Stop Aapi Hate Anti Asians Incidents Report , Biden, Aapi Hate, America, Asians-TeluguStop.com

దాడులు జరిగిన ప్రతీ సారి ఆందోళన వ్యక్తం చేయడం, దుమ్ము పట్టిన చట్టాలు దులపడం, వివాదాన్ని సాగదీయడం, చివరికి వదిలేయడం మళ్ళీ దాదాలు మొదలవ్వడం ఇవన్నీ ఒకే పద్దతిలో జరుగుతున్నాయి కానీ నిజంగా చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.గడిచిన మార్చి నెలలో ఎఫ్బీఐ అందించిన నివేదిక ప్రకారం 2019 లో దాదాపు 300 దాడులు ఆసియన్ల పై జరిగాయని చెప్పింది.

ఈ పరిస్థితి రోజు రోజుకు మించుతోందని కూడా ప్రకటించింది.దాంతో సత్య నాదెళ్ళ లాంటి ఆవేదన వ్యక్తం చేయగా, ఆసియన్లు పలు స్వచ్చంద సంస్థలు భయాందోళనలు వ్యక్తం చేసాయి.

ఈక్రమంలోనే బిడెన్ ప్రభుత్వం ఆసియన్ల పై దాడులు నివారించేందుకు ఓ బిల్లును కూడా రూపొందించింది.సెనేట్ లో నెగ్గిన ఈ బిల్లు చట్టంగా మారుతుందని కూడా బిడెన్ ప్రభుత్వం ప్రకటించింది.

అంతేకాదు ఈ బిల్లుపై ప్రజలలో అవగాహన కల్పించడం, ఆన్లైన్ లో ఎలా నేరాలు రిపోర్ట్ చేయాలో తెలియజేయడం వంటివి ప్రజలకు వివరించి చెప్తారు కూడా అయితే.ఈ బిల్లు ఇప్పటి వరకూ చట్టం అయ్యిందా లేదా ఒక వేళ అయితే ఎంత వరకూ నేరాలను అదుపు చేయగలింది అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన స్టాప్ ఏఏపీఐ హేట్ అనే స్వచ్చంద సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్లు వలన ఏ మాత్రం ఉపయోగం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా అమెరికాలో వచ్చిన నాటి నుంచీ అమెరికా వ్యాప్తంగా దాదాపు 9వేల దాడులు ఆసియన్ల పై జరిగాయని ఈ నివేదిక వెల్లడించింది.గతంలో 4500 దాడులు జరుగగా ఈ ఏడాది అంతకు మించిన దాడులు ఆసియన్ల పై జరిగాయని తేల్చి చెప్పింది.

అయితే ఈ విషయంపై బిడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆసియన్ల పై దాడులు క్షమించదగ్గవి కావని తెలిపారు.

అయితే పలు స్వచ్చంద సంస్థలు మాత్రం బిడెన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.అధ్యక్షుడిగా బిడెన్ ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube