ఆ ఫైనాన్షియర్ ను కాలితో తన్నాను.. కరాటే కళ్యాణి ఆసక్తికర వ్యాఖ్యలు?

సినిమాల్లో నటిగా, బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా ప్రేక్షకుల్లో కరాటే కళ్యాణి గుర్తింపును సంపాదించుకున్నారు.కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్న కరాటే కళ్యాణి ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Karate Kalyani Interesting  Comments About Nere Career Experience , Career Exper-TeluguStop.com

యాంకర్ బ్లాక్ బెల్ట్ కు పని చెప్పారా అనే ప్రశ్నకు ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు బ్లాక్ బెల్ట్ తో పని చెప్పలేదని మాటలతో చెప్పానని కరాటే కళ్యాణి అన్నారు.

స్కూల్ లో, కాలేజ్ లో ఉన్న సమయంలో బ్లాక్ బెల్ట్ కు పని చెప్పాల్సి వచ్చిందని కరాటే కళ్యాణి వెల్లడించారు.2000 సంవత్సరంలో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని కరాటే కళ్యాణి అన్నారు.తాను క్లబ్ కు పేకాట ఆడటానికి వెళ్లేదానినని ఆర్టిస్ట్ ల కోసం క్లబ్ ఉండేదని ఒక ఫైనాన్షియర్ కొంచెం తాగి మద్యం మత్తులో ఉన్నాడని కరాటే కళ్యాణి అన్నారు.

ఆ సమయంలో ఆ ఫైనాన్షియర్ నోరు జారాడని చులకనగా మాట్లాడటంతో తనకు విజయశాంతి అక్క గుర్తొచ్చిందని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

తాను కాలు ఎత్తి ఒక తన్ను తంతే గోడకు వెళ్లి కొట్టుకున్నాడని కరాటే కళ్యాణి తెలిపారు.

ఆ ఫైనాన్షియర్ ను చచ్చిపోతాడని భావించి చాలామంది తనను ఆపారని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.ఒక పహిల్వాన్ తో కూడా గొడవ పడ్డానని నాకు కోపం వస్తే వదిలే ప్రసక్తే లేదని కరాటే కళ్యాణి అన్నారు.

తాను తప్పు చేస్తే మాత్రం వెంటనే సారీ చెబుతానని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

Telugu Financiers, Karate Kalyani, Vijayashanti-Movie

మనల్ని పది మంది గుర్తుంచుకునేలా జీవనం సాగించాలని కరాటే కళ్యాణి వెల్లడించారు.ఎవరైనా నాది తప్పు అని చెబితే ఆ తప్పును మార్చుకుంటానని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున తన తప్పొప్పులు చూపించిన తర్వాత తాను ఆ తప్పులను సరిదిద్దుకున్నానని కరాటే కళ్యాణి అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube