మీరెప్పుడైనా కదిలే శివలింగం గురించి విన్నారా..?

సాధారణంగా మనం ఎన్నో ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకొని వస్తాము.అయితే ఆలయాలలో స్వామి విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ఒకేచోట ఉండి మనకు దర్శనమిస్తాయి.

 Mysterious Moving Shiva Lingam In Uttar Pradesh Shiva Lingam, Uttar Pradesh, Poo-TeluguStop.com

కానీ మీరు ఎప్పుడైనా కదిలే శివలింగం గురించి విన్నారా.వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఈ ఆలయంలో వెలసినటువంటి శివలింగం కదులుతూ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అయితే ఇంత అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉంది ఆలయ రహస్యాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో ఈ కదిలే శివలింగ ఆలయం ఉంది.ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన శివలింగాన్ని కదిలే శివలింగం అని,శివలింగాన్ని దుగ్దేశ్వర్నాథ్ అని కూడా పిలుస్తారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఈ లింగం ఉప లింగం.ఈ ఆలయంలో వెలసిన శివలింగాన్ని మనుషులు చేతితో ఎంత కదిపిన కదలదు.

కానీ కొన్ని సమయాలలో మాత్రం ఈ శివలింగం దానంతట అదే కథలతో భక్తులకు దర్శనమిస్తుంది.

Telugu Pooja, Shiva Lingam, Uttar Pradesh-Evergreen

అయితే ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి లింగం ఎప్పుడు కదులుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు.ఎన్నో సార్లు పూజారులు పూజ చేస్తున్న సమయంలో ఈ శివలింగం కదలటం చూసి పండితులు ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే ఈ శివలింగం కదులుతుందని తెలుసుకున్న సమయంలో భక్తులు పెద్దఎత్తున ఆలయానికి సందర్శించి స్వామి వారి అద్భుత మహిమను కనులారా చూస్తారు.

ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు ఎంతో మహిమ కలవాడని కోరికలను తీరుస్తూ వారికి కొంగుబంగారం చేస్తారా అని భక్తులు విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే శ్రావణ మాసం కార్తీక మాసం మహాశివరాత్రి వంటి ముఖ్యమైన రోజులలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అక్కడి ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube