ఒక్క రూపాయి వద్దు.. సినిమాలో అవకాశం ఇవ్వండి చాలు: అలియా భట్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “హీరా మండి” అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.ఇందులో సోనాక్షి సిన్హా,హ్యూమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

 Give A Chance In A Movie You Dont Want A Single Rupee Alia Bhat, Alia Bhat, Movi-TeluguStop.com

నెట్ ఫ్లిక్స్ కోసం బన్సాలీ ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో తనకు ఒక చిన్న పాత్ర ఇవ్వాలని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలిని బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ అడిగారని తెలుస్తోంది.

వెబ్ సిరీస్ అయినప్పటికీ ఈ ప్రాజెక్టును బన్సాలి చేపట్టడంతో ఈ సిరీస్ లో నటించడం కోసం అలియా భట్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.అదేవిధంగా ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు గాను ఆమెకు ఎలాంటి రెమ్యూనరేషన్ వద్దని, దర్శకుడికి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సంజయ్ స్పందిస్తూ ఈ సినిమాలో ఫ్రీగా వద్దని, ఇప్పుడు మార్కెట్లో తనకున్న రేటును బట్టి రెమ్యునరేషన్ తీసుకొమ్మని చెప్పినట్లు తెలుస్తోంది.

దీన్ని బట్టి చూస్తుంటే ప్రాజెక్టులు తనకు సంజయ్ లీలా బన్సాలీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

బన్సాలీ దర్శకత్వంలో ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాలో నటించారు.త్వరలోనే ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను సందడి చేయనుంది.ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube