'ఎవర్ గ్రీన్ అందగాడు మహేష్' అంటూ బర్త్ డే విషెష్ చెప్పిన చిరు !

మొత్తానికి సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా సర్కారు వారి పాట నుండి అదిరిపోయే బర్త్ డే బ్లాస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

 Chiranjeevi Birth Day Wishes To Mahesh Babu, Sarkaru Vaari Paata Teaser,sarkaru-TeluguStop.com

ఇన్నాళ్లకు వాళ్ళ ఆశ తీరింది.ఈ టీజర్ లో మహేష్ బాబు ఎప్పుడు లేనంత కొత్తగా ఇంకా యంగ్ గా కనిపిస్తున్నాడు.

ఈ టీజర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో దుమ్ము లేపుతుంది.

నిముషంన్నర నిడివి గల టీజర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేతున్నాయి. కీర్తి సురేష్ కూడా కొత్తగా అందంగా కనిపించింది.ఇప్పటికే మిలియన్ల వ్యూస్ తో దూసుకు పోతూ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

ఇది ఇలా ఉంటే ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ రంగ ప్రముఖులు మహేష్ బాబుకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

అందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు.

మహేష్ బాబుకు విషెష్ తెలుపుతూ.ఎవర్ గ్రీన్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ చిరు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించాడు.

మరిన్ని పుట్టిన రోజులను జరుపు కోవాలని కోరుకుంటూ.ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని ఆయన తెలిపాడు.

చిరు తో పాటు టాలీవుడ్ లో చాలా మంది మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్, సందీప్ కిషన్, సుశాంత్, వెన్నల కిషోర్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, రామ్ పోతినేని, నవీన్ పోలిశెట్టి, సాయి ధరమ్ తేజ్, సత్య దేవ్, దర్శకులు పరుశురామ్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, వెంకీ కుడుముల, మంత్రి కేటీఆర్ తదితరులు మహేష్ బాబుకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/KChiruTweets/status/1424587882728022027

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube