రోదసి యాత్ర కలను నెరవేర్చుకోండి.. బుకింగ్స్ తెరిచిన వర్జిన్ గెలాక్టిక్, టికెట్ ఎంతో తెలుసా..?

గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ అధినేత – బ్రిటీషర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్‌’ అధినేత– అమెరికన్‌ వ్యాపారి జెఫ్‌ బెజోస్‌ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.

 Virgin Galactic Restarts Space-trip Sales At $450,000 And Up , Space, Blue Origi-TeluguStop.com

వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ తన ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థతో జరిపేది మూడో రోదసి యాత్ర.

నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.అయితేనేం, ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే సునాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తెలిపిన నిరూపణలు.

భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన సంఘటనలు.

ఈ రెండు ప్రయోగాలతో రోదసిలోకి వెళ్లేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ నేపథ్యంలో ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ శుభవార్త చెప్పింది.తమ స్పేస్‌ ఫ్లైట్‌లో విహరించేందుకు గాను గురువారం బుకింగ్‌ను ప్రారంభించినట్టు తెలిపింది.ఇందులో ఒక్కో టికెట్‌ ధరను 4,50,000 డాలర్లు (రూ.3.33 కోట్లు)గా నిర్ణయించింది.అయితే, గతంతో పోలిస్తే, టికెట్‌ రేటును రెట్టింపు చేయడం గమనార్హం.2005, 2014లో జరిపిన టికెట్‌ బుకింగ్‌ సేల్‌లో ఒక్కో సీటుకు 2-2.5 లక్షల డాలర్ల చొప్పున వసూలు చేశారు.నాటి సేల్‌లో 600 మంది సీట్లను బుక్‌ చేసుకున్నారు.అయితే, ఇటీవల జరిపిన స్పేస్‌ యాత్ర విజయవంతం కావడంతో ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ టికెట్‌ రేట్లను అమాంతం పెంచినట్టు తెలుస్తున్నది.

మరోవైపు, గురువారం నుంచి ప్రారంభమయ్యే తాజా సేల్‌లో రెండు టికెట్లను ఉచితంగా ఇస్తామని ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ ప్రకటించింది.‘ఎర్లీ బర్డ్‌’ ఆఫర్‌ కింద ఇవ్వనున్న ఈ టికెట్లను దక్కించుకోవాలంటే సెప్టెంబర్‌ 1లోపు తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ కావాలని వెల్లడించింది.

కాగా, వర్జిన్‌ గెలాక్టిక్‌ రెండో రోదసి యాత్ర వచ్చే నెలలో, మూడో విడుత యాత్ర వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ఉండనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అయితే జూలై 11న వర్జిన్ గెలాక్టిక్ విజయవంతంగా తన యాత్రను పూర్తి చేసుకున్న తర్వాత.

తన సిబ్బంది, సన్నిహితులకు బ్రాన్సన్ పార్టీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ లోరీ గార్వర్ హాజరయ్యారు.

ఆ సమయంలో వర్జిన్ గెలాక్టిక్ తదుపరి ప్రయాణానికి జార్జ్ నాయకత్వం వహిస్తారని బ్రాన్సన్ చెప్పినట్లుగా లోరీ గార్వర్ సీఎన్‌బీసీకి తెలిపారు.అయితే ఈ కథనాలపై వర్జిన్ గెలాక్టిక్ స్పందించలేదు.

Telugu Blue Origin, Bird, Nasa Deputy, Jeff Bezos, Led George, Lori Garver, Sant

కాగా, కేరళకు సంతోష్‌ జార్జ్‌ కులంగర కూడా వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు.ఇందుకోసం 2.5 లక్షల డాలర్ల ( భారత కరెన్సీలో రూ.1.8 కోట్లు)ను సంతోష్ ఖర్చు పెట్టనున్నారు.తద్వారా టికెట్‌ కొని రోదసియాత్ర చేపట్టిన తొలి భారతీయ పర్యాటకుడిగా ఆయన రికార్డుల్లోకెక్కనున్నారు.

తనతో పాటు ఓ కెమెరానూ కూడా అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లనున్నట్లు సంతోష్‌ వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాలీల తరపున ఈ యాత్రను చేపడుతున్నానని ఆయన చెప్పారు.‘సంచారం’ పేరుతో యూట్యూబ్‌లో యాత్రా విశేషాలను వివరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంతోష్‌ .ఇప్పటివరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశారు.అలాగే 24 ఏళ్ల కాలంలో ప్రపంచంలోని 130కి పైగా దేశాలను చుట్టేశారు.2007 నుంచి అంతరిక్ష యాత్ర కోసం తహతహలాడుతున్న సంతోష్.ఇందుకోసం శిక్షణ కూడా కంప్లీట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube