శాకుంతలం సెట్స్ కు వెళ్లి కూతురును సర్ప్రైజ్ చేసిన బన్నీ..పిక్ వైరల్!

అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్న తన పిల్లలతో మాత్రం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు.తాజాగా కూతురు కోసం అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి మరి శాకుంతలం సెట్స్ కు వెళ్ళాడు.

 Allu Arjun Visits Shakuntalam Movie Sets To Surprise His Daughter, Allu Arjun, A-TeluguStop.com

అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతుందని అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమా ద్వారా అర్హ బాల నటిగా మన ముందుకు రాబోతుంది.

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం.ఈ సినిమాలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ నటించ బోతుంది.ప్రస్తుతం శాకుంతలం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ షూటింగ్ లో అల్లు అర్హ పాల్గొంటుంది.

అందుకే అల్లు అర్జున్ తన గారాలపట్టికి సర్ప్రైజ్ ఇవ్వాలని శాకుంతలం సెట్స్ లోకి అడుగు పెట్టాడు.

Telugu Allu Arha, Allu Arjun, Alluarjun, Gunasekhar, Shaakuntalam-Movie

సెట్ లోకి అడుగు పెట్టిన బన్నీ కొంత సమయం అక్కడే ఉండి అల్లు అర్హ షూటింగ్ ను దగ్గర ఉండి గమనించారు.అల్లు అర్జున్ తో పాటుగా తన భార్య అల్లు స్నేహ, కుమారుడు అల్లు అయాన్ కూడా సెట్స్ లో సందడి చేసారు.సెట్ లోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ని డైరెక్టర్ గుణ శేఖర్, నిర్మాత నీలిమ బొకే తో స్వాగతం పలికారు.

చిత్ర యూనిట్ తో కూడా అల్లు అర్జున్ కొంత సమయం గడిపి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.

Telugu Allu Arha, Allu Arjun, Alluarjun, Gunasekhar, Shaakuntalam-Movie

అయితే అల్లు అర్జున్, స్నేహ అయాన్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమా కూడా పాన్ ఐడియా సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అక్కినేని సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

శకుంతల, దుష్యంతుడి అందమైన ప్రేమ కథను గుణశేఖర్ మన ముందుకు తీసుకు రాబోతున్నాడు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.మొదటి సినిమాతోనే పాన్ ఇండియా సినిమాలో కనిపించే బోతున్న అర్హ ను గుణశేఖర్ ఎంతబాగా ప్రెసెంట్ చేస్తారో వేచి ఉండాల్సిందే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube