అరుదైన వస్తువులను సాధారణంగా వేలం పాట వేయడం మనం చూడొచ్చు.ఇక అవి అతిపురాతనమైనవైతే చాలు.
వాటికి మంచి ధర పలకడం కూడా కామనే.కాగా, ఓ సాధారణ వస్తువుకు అత్యంత ధర పలికింది ఆ ప్రాంతంలో.
ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ? అసలేం జరిగింది? ఏ వస్తువును వేలం పాటలో కొన్నారు? వంటి తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
వేలం పాటలో అట్లాంటీస్ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్ ఐదు లక్షల రూపాయల ధర పలికింది.
అవునండీ.మీరు చదివింది నిజమే.
కేవలం ప్లాస్టిక్ కవర్‌కు అంత ధర పలకడం చూస్తే సామాన్యులే ఆశ్చర్యపోతారు.ఈ వింత వేలం చూసి ముక్కున వేలేసుకున్నారు పలువురు.
అసలు ఆ ప్లాస్టిక్ కవర్లో ఏముందంటే.నార్మల్‌గా గాలి మాత్రమే ప్లాస్టిక్ కవర్లో ఉంటుంది.
అది ఆ కవర్లోనూ ఉంది.అయితే, ఈ గాలి ఉన్న ప్టాస్టిక్ కవర్‌కు ఓ స్పెషాలిటీ ఉంది.
డొండా డ్రాప్ అనే ఒక ఈవెంట్‌కు చెందిన ప్లాస్టిక్ కవర్ ఇది.అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ కన్యె వెస్ట్ మీకు తెలిసే ఉండొచ్చు.ఆయనకు ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా ఉండదు.ఆయన త్వరలో ‘డొండా’ అనే ఆల్బమ్‌ను విడుదల చేయబోతున్నారు.ఇందుకు సంబంధించిన ప్రివ్యూ కన్సర్ట్ను అట్లాంటాలోని మెర్సిడిస్ బెంజ్ స్టేడియంలో ఏర్పాటు చేశాడు.ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ కన్యె వెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండబోయే స్టేడియంలోని గాలిని ప్లాస్టిక్ కవర్లో నింపాడు.
అనంతరం దానిని ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఈ-బేలో వేలం వేయగా దీనిని కొనేందుకు జనాలు ఎగబడ్డారు.చూశారా? ప్లాస్టిక్ కవర్‌ను తీసుకునేందుకు అభిమానులు ఎంతలా ఎగబడ్డారో మనం చూడొచ్చు.