ఆ కంట్రీలో క్రైస్తవులు శివుడిని పూజిస్తారట.. మీకు తెలుసా?

భక్తి భావనను ప్రపంచానికి అందించిన భారతదేశంలో మాత్రమే శివుడు కొలువు దీరి ఉన్నాడని మీరు అనుకుంటే పొరపడినట్లే.హిందూ దేవుళ్లను భారత్ మాత్రమే కాకుండా వివిధ దేశాల్లోని ప్రజలు కూడా పూజిస్తారు.

 Christians Worship Shiva In That Country  You Know, Christians, Shiva, Irland-TeluguStop.com

ముఖ్యంగా శివుడి ఆలయాల్లో విదేశాల్లోనూ చాలానే ఉన్నాయి.ఈ క్రమంలోనే మన దేశంతో పాటు విదేశాల్లో వెలిసిన టెంపుల్స్‌ కొన్ని మిస్టరీలను తమలోనే దాచుకుని ఉన్నాయి.

కాగా, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ స్టోరీలో క్రైస్తవులు హిందూ దేవుడైన శివుడిని పూజిస్తున్నారు.అదెక్కడో తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

మనదేశంలో హిందువులు మాత్రమే కాకుండా వివిధ మతాలకు చెందిన వారు కూడా హిందూ దేవుళ్లను పూజిస్తుంటారు.ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం.కాగా ఈ దేశంలో క్రైస్తవులు శివుడిని పూజిస్తున్నారు.ఐర్లాండ్ దేశంలో క్రైస్తవులు భక్తితో శివుడిని పూజిస్తారట.

కాగా, ఇక్కడ కొలువు దీరి ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేయాలని ఎన్నోసార్లు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.కావాలనే ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అస్సలు శివలింగం ధ్వంసం కాలేదని స్థానికులు చెప్తున్నారు.

అయితే, ఇక్కడ శివుడు కొలువు దీరి ఉండటం వల్లే ధంసం కాలేదని, అది ఆయనే మహత్యమేనని స్థానికులు నమ్ముతున్నారు.మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో ఉన్న ఈ పురాతన శివలింగం చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుంది.

భూమి లోపలి నుంచి పొడుచుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది.ఈా లింగాన్ని క్రైస్తవ సన్యాసులు పునరుత్పత్తికి చిహ్నంగా భావిస్తారు.

దీని గురించి తమ గ్రంథాల్లో ప్రస్తావన ఉందని పేర్కొంటారు.ఈ క్రమంలోనే క్రైస్తవులు దీనిని ఆరాధిస్తున్నారని తెలుస్తోంది.

వందళ ఏళ్ల కిందట తమ పూర్వీకులు ఈ లింగాన్ని గుర్తించినట్లు స్థానికులు వివరిస్తున్నారు.ఈ శైవవలింగాన్ని లియా ఫెల్ అని స్థానిక భాషలో పిలుస్తారు.

ఇక ఈ లింగాన్ని అదృష్ట శిల అని కూడా భావిస్తారట.దర్శన భాగ్యం చేత అదృష్టం వరిస్తుందని వారి ప్రగాఢనమ్మకం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube