కెనడా: భారత సంతతి పారిశ్రామిక వేత్తకు అత్యున్నత పురస్కారం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే వారిని ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరిస్తున్నాయి.

 Indian-origin Entrepreneur Honoured With Order Of British Columbia, Province Of-TeluguStop.com

తాజాగా కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అవార్డుకు భారత సంతతి పారిశ్రామిక వేత్త అజయ్ దిలావ్రీ ఎంపికయ్యారు.

బ్రిటీష్ కొలంబియా ప్రభుత్వ ప్రకటన ప్రకారం.

ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అవార్డుకు ఎంపికైన 16 మంది అసాధారణ వ్యక్తులలో కెనడాలోని అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూప్ దిలావ్రీ గ్రూప్ అధినేత అజయ్ దిలావరీ ఉన్నట్లు తెలిపింది.పారిశ్రామికవేత్తగా దిలావరీ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నారని ప్రశంసించింది.

అజయ్.కెనడావ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపారని ఆయనతో పాటు దిలావ్రీ సోదరులు కాప్, టోనీలు సైతం 4000 మంది ఉద్యోగులు, 76 ఆటోమోటివ్ డీలర్‌షిప్‌లతో దేశంలో అతిపెద్ద ఆటోమోటివ్ గ్రూప్‌ను నడుపుతున్నారని బ్రిటీష్ కొలంబియా కొనియాడింది.

బ్రిటీష్ కొలంబియాలో 24 డీలర్‌షిప్‌లతో ఈ ప్రావిన్స్‌లో 2,000 మందికి పైగా ఉపాధి కల్పించారని తెలిపింది.ఎలక్ట్రికల్ వెహికల్ డెవలప్‌మెంట్‌పై ఆయన పెట్టుబడులు.వాతావరణ మార్పులపై సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటంతో పాటు ఆర్ధిక వ్యవస్థకు సైతం దోహదం చేస్తుందని బ్రిటీష్ కొలంబియా ప్రభుత్వం ప్రశంసించింది.దిలావ్రీ సోదరుల తల్లిదండ్రులు భారత్ నుంచి కెనడాకు వలస వచ్చారు.

దిలావ్రీ సోదరులు ఇక్కడ పెరిగిన విషయాన్ని మరిచిపోకుండా సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నారని ప్రశంసించింది.

Telugu Automobile, Dilavriajay, Vehicle, Indianorigin, Britishcolumbia, Province

కాగా, ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా అవార్డును ఇప్పటి వరకు 475 మంది అందుకున్నారు.ఈ ఏడాది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా గ్రహీతలు ప్రతి ఒక్కరూ కూడా తమ కమ్యూనిటీలకు అద్భుతమైన కృషి చేశారని బ్రిటీష్ కొలంబియా ప్రీమియర్ జాన్ హోర్గాన్ కొనియాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube