జక్కన్నలో ఆ నైపుణ్యం లేదట.. సీక్రెట్స్ చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్?

టాలెంట్ పుష్కలంగా ఉండటంతో పాటు తన టాలెంట్ ను సద్వినియోగం చేసుకుంటూ విజయాలను అందుకుంటున్న దర్శకధీరుడు రాజమౌళికి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.అయితే రాజమౌళికి కుటుంబ సభ్యుల ప్రోత్సహం ఉండటం అతని కుటుంబ సభ్యుల టాలెంట్ కూడా సినిమాలకు ప్లస్ అవుతుండటం గమనార్హం.

 Star Writer Vijayendra Prasad Interesting Comments About Rajamaouli Story Writin-TeluguStop.com

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తన కొడుకు పనితీరు గురించి, ప్రతిభ గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి మంచి కథను ఎంచుకుని సినిమాను అద్భుతంగా తెరకెక్కించగలరని అయితే సొంతంగా కథ రాసుకునే నైపుణ్యం మాత్రం అతనిలో లేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

మేకింగ్ విషయంలో రాజమౌళి నిదానంగా ఉంటారని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు.రాజమౌళిని మేకింగ్ విషయంలో మారాలని చాలాసార్లు సూచించానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

Telugu Purijagannath, Rajamouli, Sukumar-Movie

రాజమౌళికి, సుకుమార్ కు పనితీరు విషయంలో పెద్దగా తేడా లేదని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.సుకుమార్ కు, రాజమౌళికి సినిమాపై ఉండే ఫ్యాషన్ విషయంలో, ప్రజెంటేషన్ విషయంలో తేడా ఉండదని అయితే తన ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం పూరి జగన్నాథ్ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.పూరీ జగన్నాథ్ చాలా వేగంగా సినిమాలు తీస్తారని ఆ లక్షణం పూరీ జగన్నాథ్ లో చాలా నచ్చుతుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

Telugu Purijagannath, Rajamouli, Sukumar-Movie

పూరీ జగన్నాథ్ ఫైట్లను కంపోజ్ చేసే తీరు బాగుంటుందని ఫైట్ కు చాలా చిన్న సీన్ తో కూడా లీడ్ ఇవ్వగల సామర్థ్యం పూరీ జగన్నాథ్ సొంతమని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.త్రివిక్రమ్ హ్యూమర్ తనకు చాలా నచ్చుతుందని తన ఫేవరెట్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.తన కొడుకు గొప్ప డైరెక్టర్ అయినప్పటికీ విజయేంద్ర ప్రసాద్ ఇతర డైరెక్టర్లను కూడా ప్రశంసించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube