బాబాయ్ కోసం జగన్ హామీ.. సుబ్బారెడ్డి‌కి అంత ప్రాముఖ్యతా?

తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పుణ్యక్షేత్రం.ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తిరుమల తిరుపతిని సందర్శించుకునేందుకు వస్తుంటారు.

 Jagan Guarantee For Subbareddy Is It So Important For Subbareddy, Jagan, Yv Subb-TeluguStop.com

ఈ పుణ్యక్షేత్ర నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.ఇక్కడ వచ్చే ఆదాయం కూడా భారీ మొత్తంలోనే ఉంటుంది.

కాగా, టీటీడీ పాలక మండలి ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడటంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.ఇకపోతే టీటీడీ చైర్మన్ పదవిని ఆశించేవారు దేశవ్యాప్తంగా బోలెడు మంది ఉంటారు.

దేవాలయ సన్నిధిలో ఉంటూ ఆ పదవి నిర్వహిస్తే పుణ్యం దక్కుతుందని అనుకుంటుంటారు.ఈ క్రమంలోనే ఎక్కువ మందిని ఆలయ పరిధిలో పాలక మండలి సభ్యులుగా నియమించేందుకుగాను జగన్మోహన్ రెడ్డి సర్కార్ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచింది.

టీటీడీ చైర్మన్ పదవి మరోసారి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే ఇవ్వాలని భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.వైసీపీ పార్టీ వర్గాల్లోనూ ఈ విషయమై చర్చ జరుగుతున్నది.

అయితే, వైవీ సుబ్బారెడ్డి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ఉవ్విళ్లూరుతున్నారని పార్టీ అంతర్గత సమావేశాల్లో పేర్కొన్నట్లు వినికిడి.

Telugu Jagan, Jagans Babi, Ttd Chairman, Ttdchairman, Ycp, Yvsubba-Telugu Politi

ఈ నేపథ్యంలో సీఎం జగన్ బాబాయ్‌ని బుజ్జగించినట్లు సమాచారం.ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి అమెరికాలో ఉండగా, ఆయన ఇండియాకు రాగానే మళ్లీ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనున్నారట.అయితే, వైసీపీ నేతల్లో చాలా మంది టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులుగా నియామకం కోసం ఎదురు చూస్తుండగా, సభ్యుల సంఖ్యను మరోసారి పెంచాలా? అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సభ్యులు ఇప్పటికే జంబో కేబినెట్ మాదిరిగా మరోసారి పెంచితే విపక్షాల నుంచి విమర్శలు తప్పక వస్తాయని అధికార వైసీపీ పార్టీ ఆలోచనలో పడిందట.గతంలో 18 మంది పాలకమండలి సభ్యులు ఉండగా, ఆ సంఖ్యను 37కి పెంచింది జగన్ సర్కారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube