లీకు వీరులు : ముగ్గురు అధికార్లపై ఏపీ ప్రభుత్వం వేటు ?

గత కొంతకాలం గా ఏపీ ప్రభుత్వం పై టీడీపీ అనేక విమర్శలు చేస్తోంది.ఈ విమర్శలు ఎప్పుడూ ఉండేవే అయినా, ఆర్థికపరమైన అంశాలను ప్రస్తావిస్తూ, లెక్కలతో సహా చెబుతూ విమర్శలు చేస్తోంది.

 The Ap Government Has Suspended Three Official For Leaking Information, Ap Gover-TeluguStop.com

ఈ విమర్శలపై ఏపీ ప్రభుత్వం ఆత్మరక్షణ లో పడింది.ప్రజల్లోనూ టీడీపీ చేసే విమర్శలు చర్చనీయాంశం అవుతూ, జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.

ఇదంతా రాజకీయ విమర్శలు మాత్రమే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న, జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతూ ఉండడంతో వైసీపీ ఈ విషయం పై సీరియస్ గా దృష్టిపెట్టింది.అసలు ఆర్థిక శాఖ కు సంబందించిన విషయాలు ఎలా బయటకి వెళ్తున్నాయి అనే విషయంపై దృష్టిపెట్టగా, కొంతమంది ఆర్థిక శాఖ అధికారుల పాత్ర ఉంది అనే విషయం బయటకి వచ్చింది.

దీంతో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు సంబందించిన రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే కారణలతో ముగ్గురు అధికర్లపై ప్రభుత్వం చర్యలకు దిగింది.

ముగ్గురు అధికార్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ఆర్థిక శాఖకు సంబంధించిన విషయాలపై మీడియాలో వస్తున్న కథనాలపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది.ఈ విచారణ ఆధారంగా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న నాగుల పాటి వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న డి శ్రీను బాబు, కసిరెడ్డి వరప్రసాద్ లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.అంతేకాదు ఈ ముగ్గురు అధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళ కూడదు అని ఆదేశాలు జారీ చేసింది.

Telugu Ap Finacial, Ap, Apofficers, Central, Jagan, Ysrcp-Political

ఏపీ ఆర్థిక పరిస్థితి పై ఇప్పటికే టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండటం, టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తుండడం , ఏపీ ప్రభుత్వం కేంద్రం మధ్య జరుగుతున్న ఆర్థిక సంబంధిత వ్యవహారాలపై లేఖలు బయటకు వస్తుండటం, తదితర పరిణామాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి అధికారులపై చర్యలు తీసుకుంది.ముగ్గురు అధికారుల పాత్ర స్పష్టంగా ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.దీనిపై ఉద్యోగ సంఘాలు అటు టీడీపీ ఎలా స్పందిస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube