పుష్ప సినిమాలో అనసూయ పాత్ర ఆ స్థాయిలో ఉందా?

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప“.ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించగా అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

 Anchor Anasuya Character In The Film Pushpa As Sunil Wife, Allu Arjun, Pushpa Mo-TeluguStop.com

గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుందని ఇది వరకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది.

అనసూయ ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సినిమా ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న అనసూయ పలు సినిమాల్లో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే మరోసారి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.రంగమ్మత్త పాత్ర ఏ స్థాయిలో పేరు సంపాదించిందో పుష్ప సినిమాలో అనసూయ నటించే పాత్రకి కూడా అంతే ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Anasuya, Role, Pushpa, Rangammatha, Rangasthalam, Sukumar, Su

పుష్ప సినిమాలో అనసూయ సునీల్ భార్యగా నటించబోతుందని సమాచారం.ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో అనసూయ కనిపించబోతున్నారు.ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే సన్నివేశంలో అనసూయ నటించనున్నారు.ఇకపోతే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లతో పాటు అనసూయ కూడా డీ గ్లామర్ పాత్రలో మేకప్ లేకుండా కనిపించనున్నారు.

Telugu Allu Arjun, Anasuya, Role, Pushpa, Rangammatha, Rangasthalam, Sukumar, Su

మొత్తానికి రంగమ్మత్త “పుష్ప” సినిమాలో మరోసారి కీలక పాత్రలో చేయడంతో ఆమె అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పవచ్చు.ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా మొదటి పార్ట్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube