పదవులు ఇచ్చారు సరే ! అవన్నీ ఉత్తుత్తేనా ?

ఎప్పుడూ సాహసోపేతమైన సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏపీ సీఎం జగన్.జగన్ ఏ నిర్ణయమైనా సంచలనమే అన్నట్లుగా ఉంటుంది.

 Ap Government, Ap Nominated Posts, Jagan, Ap Cm, Ysrcp Leaders, Ap Financial Pro-TeluguStop.com

ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలు, నిర్ణయాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.తాజాగా పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక దఫాలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్న జగన్, తాజాగా రాష్ట్ర స్థాయి లో 135 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి, నేతలందరికీ ప్రాధాన్యం కల్పించారు.ఈ పోస్టుల ప్రకటనపై పార్టీలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.

ఆ విషయమై టిడిపి అధినేత చంద్రబాబుతో జగన్ పోల్చుకుంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తికి గురవు తున్నారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ తరహా నామినేటెడ్ పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రయత్నించలేదని, దీంతో తాము రాజకీయ నిరుద్యోగులుగా ఉండిపోవాల్సి వచ్చింది అని ఆవేదన చెందుతున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పదవులు తీసుకున్నామన్న సంతోషం లో ఉన్న నేతలకు దిమ్మ తిరిగే వాస్తవాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి.కేవలం రాజకీయ అలంకార ప్రాయంగానే తప్ప వీరికి నిధులు, విధులు పెద్దగా ఉండవు అన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తుండడంతో, ఆ పదవులు పొందిన నేతలు కాస్త అసంతృప్తి చెందుతున్నారట.

ప్రస్తుతం 135 కార్పొరేషన్ చైర్మన్ లను నియమించారు.వారి ఆఫీస్ మెయింటెనెన్స్, వాహనాలు, గౌరవ వేతనం, ఇలా దాదాపు రెండు కోట్లకు పైగా నే కేంద్రంపై భారం పడుతుంది.

గతంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ లుగా 56 మంది నియమించారు.

Telugu Ap Cm, Apfinancial, Ap, Jagan, Ysrcp-Telugu Political News

ఇప్పటికీ వారికి సరైన సౌకర్యాలు, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారి పదవులు అలంకారంగానే మారాయి.ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసినా, వారికి పూర్తిస్థాయిలో నిధులు, వాహనాలు, ఆఫీస్ మేయింటినెన్స్ ఇలా ఏవీ ఏర్పాటు చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించకపోవడంతో, ఇవన్నీ అలంకారప్రాయ పదవులు గానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది అనేది పదవులు పొందిన నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube