టీమ్ ఇండియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌..!

టీమ్ ఇండియాకు, ఇంగ్లండ్‌కు మ‌ధ్య ఎన్నో ఏండ్ల నుంచి కొంత వైరుధ్యం ఉంద‌నే చెప్పాలి.ఈ రెండు జ‌ట్లు పోటీ ప‌డ్డ ప్ర‌తీసారి ఎవ‌రు గెలుస్తారా అనే ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంటుంది.

 Former England Captain Makes Interesting Comments About Team India ..!, Team Ind-TeluguStop.com

ఇక ఈ రెండు టీమ్ ల మ‌ధ్య పోటీ వ‌చ్చిన ప్ర‌తిసారీ ఇండియాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు.ఇక మ‌న ఇండియాకు టీమ్ ఇంగ్లండ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మ‌న ఇండియ‌న్ పిచ్‌ల గురించి మైకేల్ ఎద్దేవా చేసిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

ఇక ఇదే క్ర‌మంలో ఈ ఏడాది స్టార్టింగ్లోనే ఇంగ్లండ్ ఆట‌గాళ్లు మ‌న దేశానికి ఆడేందుకు వ‌చ్చారు.

ఇక అప్పుడు కూడా మ‌న టీమ్ గురించి ఎద్దేవా చేసిన‌ట్టు మాట్లాడితే అభిమానులు ఆయ‌న్ను సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేసి కౌంట‌ర్లు వేశారు.

ఇక ఇప్పుడు మ‌రోసారి ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతున్నాయి.ఇక ఈ సిరీస్ కాస్తా బుధవారం నుంచి తొలి టెస్టు ఆడి సిరీస్‌ను ప్రారంభించ‌నున్నాయి ఇరు జ‌ట్లు.

అయితే ఇప్పుడు మాత్రం మైకేల్‌ వాన్ ఇండియాకు స‌పోర్టు చేస్తున్న‌ట్టు మాట్లాడాడు.సిరీస్‌ టీమిండియానే గెలుచుకుంటుంది అంటూ అందరినీ ఆశ్చర్యానికి లోను చేశాడు మైకేల్ వాన్‌.

Telugu Ben, Engla India, England, Michel Van, Upadts, India-Latest News - Telugu

ఇండియా గెలుస్తుంద‌ని చెప్ప‌డం తన‌కు ఇష్టపడనప్పటికీ కూడా ప్రస్తుత ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి చెప్పాల్సి వ‌స్తోంద‌ని మైకేల్ వివ‌రించారు.ఇప్పుడున్న బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి చూస్తుంటే ఇండియా టీమ్ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మైకేల్ వివ‌రించారు.ప్రస్తుత సిరీస్‌లో మాత్రం టీమిండియా చాలా బ‌లంగా ఉంద‌ని, క‌చ్చితంగా వాళ్లకే సిరీస్ ద‌క్కుతుంద‌ని వ్యాఖ్యానించాడు.స్టోక్స్ లేక‌పోవ‌డంతో ఇంగ్లండ్ ఓడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించారు.ప్ర‌స్తుతం ఆయ‌న కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి.విప‌రీతంగా కామెంట్లు వ‌స్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube