తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో హీరోయిన్ గా స్పెషల్ అట్రాక్షన్ గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్ కు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ దక్కింది.ఫినాలే వీక్ కు చివరి వారంలో ఆమె ఎలిమినేట్ అయ్యింది.
గత సీజన్ లో అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ గా గుర్తింపు దక్కించుకుంది.సోషల్ మీడియాలో ఈమెకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కొందరు విమర్శలు చేసినా కూడా అసలు రావాల్సిన గుర్తింపు మాత్రం బాగనే వచ్చింది.ఈమె వల్ల బిబి సీజన్ 4 రేటింగ్ కూడా బాగా వచ్చింది అనడంలో సందేహం లేదు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 తో వచ్చిన గుర్తింపును మోనాల్ ఫుల్ గా వాడేసుకోవాడానికి ప్రయత్నాలు చేస్తోంది.తెలుగు మరియు తమళ సినీ పరిశ్రమల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది.
ఇప్పటికే పలు సినిమాలు చేయడంతో పాటు ఐటెం సాంగ్ ను కూడా చేసిన మోనాల్ కు అతి పెద్ద ఆఫర్ వచ్చింది.తెలుగు ప్రేక్షులు చాలా రోజులుగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగార్రాజు సినిమా లో ఈమెకు ఛాన్స్ దక్కింది.
అక్కినేని అభిమానులు అయిదు ఆరు సంవత్సరాలుగా ఎప్పుడు ఎప్పుడు అన్నట్లుగా బంగార్రాజు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.అలాంటి సినిమాలో మోనాల్ కు కీలక పాత్రలో ఆఫర్ దక్కిందట.
ఒక ఐటెం సాంగ్ కూడా ఈమెతో ఉంటుందని తెలుస్తోంది.
సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అనసూయ మరియు మరో హీరోయిన్ కనిపించగా ఈసారి బంగార్రాజు లో ఈ అమ్మడిని ఎంపిక చేశారట.ఈ సినిమా ను త్వరలో పట్టాలెక్కించబోతున్నారు.నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.
నాగ చైతన్య కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమా లో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు రావడంతో ఆమె కెరీర్ టర్న్ అవ్వబోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.