27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి: బిల్ గేట్స్ దంపతుల విడాకులకు కోర్ట్ ఆమోదముద్ర

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆయన సతీమణి మెలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి అధికారికంగా తెర ప‌డింది.మెలిండా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విడాకుల‌కు కోర్టు ఆమోదం తెలిపింది.

 Bill Gates, Melinda French Officially Divorced Court Document, Bill And Milinda-TeluguStop.com

దీంతో బిల్ గేట్స్ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయారు.తాము విడిపోతున్న‌ట్లు గేట్స్ దంప‌తులు మే నెల‌లోనే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అనంతరం వాషింగ్ట‌న్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మెలిండా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.దీనిని పరిశీలించి విచారణ జరిపిన న్యాయమూర్తి విడాకులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్టు ఆధారంగా విడాకులు ఇవ్వడం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.ఎవ‌రికి ఎవ‌రు భ‌ర‌ణం ఇచ్చే రీతిలో ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని కోర్టు డాక్యుమెంట్ల ద్వారా స్ప‌ష్టం అవుతున్న‌ది.

విడాకుల ఆమోద ప‌త్రంలో ఆర్థిక అంశాల గురించి కూడా ఎటువంటి ప్ర‌స్తావ‌న లేదు.తాజా స‌మాచారం ప్ర‌కారం.బిల్ గేట్స్ సంపద విలువ సుమారు 152 బిలియ‌న్ల డాల‌ర్లు.అయితే డైవ‌ర్స్ త‌ర్వాత ఆ ఆస్తి ఒక‌వేళ ఇద్ద‌రికీ స‌మానంగా పంపిణీ చేస్తే, అప్పుడు ఒక్కొక్క‌రికి సుమారు 76 బిలియ‌న్ల డాల‌ర్లు వస్తుంది.

అయితే 50 బిలియ‌న్ డాల‌ర్ల గేట్స్ ఫౌండేష‌న్‌ను మాత్రం ఇద్ద‌రూ క‌లిసి మ‌రో రెండేళ్ల పాటు న‌డుపుతారని సమాచారం.గత రెండు దశాబ్దాలుగా బిల్-మిలిండా గేట్స్ ఫౌండే‌షన్ మలేరియా సహా పలు ప్రాణాంతక వ్యాధులు, వ్యవసాయ పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలకు నిధులు సమకూర్చుతూ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిండాకు 56 ఏళ్లు.అత్యంత చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన బిల్‌గేట్స్‌.ఆ సంస్థకు సీఈవోగా ఉన్నప్పుడు 1987లో మెలిండా ప్రొడక్ట్‌ మేనేజరుగా చేరారు.అప్పట్లో ఆ సంస్థలో చేరిన ఏకైక ఎంబీఏ మహిళా గ్రాడ్యుయేట్ ఆమే కావడం విశేషం.

ఆ తర్వాత ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో 1994లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ బాధ్యతల నుంచి 2008లో తప్పుకున్న బిల్ గేట్స్.

ధార్మిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రకటించారు.తర్వాత బోర్డు సభ్యత్వం నుంచి వైదొలగిన గేట్స్.కేవలం టెక్నాలజీ ఎడ్వైజర్‌గానే కొనసాగుతానని స్పష్టం చేశారు.2014లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ పదవి నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు.

Telugu Milinda Gates, Gates, Billgates, Melinda, Melindafrench, Advisor-Telugu N

తన భార్య మెలిండాతో కలిసి ఏర్పాటు చేసిన ‘బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌‘ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే తాను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గేట్స్ అప్పట్లో ప్రకటించారు.అయితే, అది నిజం కాదని ఇటీవల పలు అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి.సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌ లైంగిక సంబంధాలు కొనసాగించారని.దీనిపై బోర్డు మూడో సంస్థతో విచారణ చేయించిందని కథనాలు వెలువడ్డాయి.ఈ కారణం చేతనే ఆయన బోర్డు నుంచి వైదొలిగినట్లు మైక్రోసాఫ్ట్‌ అధికారిక వర్గాలే వెల్లడించినట్లు ఆ కథనాల సారాంశం.

కొన్ని నెలల క్రితం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజాస్, ఆయన భార్య మెకన్‌జై విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్న కుబేరుల జంట గేట్స్ దంపతులే కావడం గమనార్హం .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube