రామ్, లింగుసామి మూవీకి అదిరిపోయేలా ఆడియో రైట్స్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

 Ram Lingusami Movie Audio Rights Huge Demand,latest Tollywood News-TeluguStop.com

సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం కూడా ప్లస్ అని చెప్పొచ్చు.ఒక్క సినిమాతోనే అమ్మడికి యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమాలో మరో భామ అక్షర గౌడ కూడా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.ఇదిలాఉంటే రామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డ్ బిజినెస్ చేస్తుంది.

Telugu Krithi Shetty, Lingusami, Ram, Ram Pothineni, Uppena-Movie

సినిమా ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ భారీ రేటుకి కొనేసినట్టు తెలుస్తుంది.2.75 కోట్లకు రామ్, లింగుసామి మూవీ ఆడియో రైట్స్ అమ్ముడైనట్టు టాక్.రామ్ కెరియర్ లో ఆడియో రైట్స్ హయ్యెస్ట్ ప్రైజ్ ఇదే అని తెలుస్తుంది.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.ఈ మూవీని శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో రెండు హిట్లు అందుకున్న రామ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టాడు.ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube