మరో సహాయంకి నాంది పలికిన రిలయన్స్ ఫౌండేషన్...!

దేశంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది.రిలయన్స్‌ ప్రతిసారి తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటుంది.

 Reliance Foundation Launches Another Initiative  Reliance Foundation, Municipal--TeluguStop.com

రిలయన్స్‌ ఫౌండేషన్‌ తరపున పేదలుగా ఉన్నటువంటి ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి అది కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేయిడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది.తాజాగా బృహణ్‌ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ (బీఎమ్‌సీ), రిలయన్స్‌ ఫౌండేషన్‌ రెండూ కలిసి ముంబై మహా నగరంలోని దాదాపు 50 స్లమ్ ఏరియాల్లో బతుకుతున్న వారికి వ్యాక్సిన్లు ఇవ్వనుండటం విశేషం.

ప్రజలకు రిలయన్స్ దాదాపుగా మూడు లక్షల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వనున్నట్లు తెలియజేసింది.ఈ విషయాన్ని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రోగ్రామ్ ను సర్‌ హెచ్‌.ఎన్‌.

రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్ మూడు నెలలపాటు నిర్వహించేందుకు తలపెట్టింది.ఈ ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కొలాబా, ప్రతీక్ నగర్, కామాతీపుర, చెంబూర్, భండూప్‌, వడాలా, ధారావి , మంఖుర్ద్, గోవండి వంటి పరిసర ప్రాంతాల్లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ వారు ఏర్పాటు చేశారు.

సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అత్యాధునిక మొబైల్ వాహన విభాగాన్ని ముంబైలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయనుంది.

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా ఎం అంబానీ మాట్లాడుతూ కోవిడ్‌-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ పోరాటం చేస్తోందన్నారు.ఈ పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశానికి అండగా ఉంటుందన్నారు.

కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడటానికి వ్యాక్సిన్ డ్రైవ్‌లను నిర్వహిస్తోందన్నారు.

Telugu Lakhs, Jobs, Greater, Mumbai, Corp, Reliance-Latest News - Telugu

ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు.కరోనా కట్టడి కోసం రిలయన్స్ ఫౌండేషన్ వివిధ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తోంది.దేశంలో కరోనా టెస్టింగ్​, లిక్విడ్​ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను రిలయన్స్ ఫ్రీగా అందజేసింది.

అంతేకాకుండా దాదాపుగా కోటి మాస్క్‌ లను, ఏడున్నర కోట్ల భోజనాలను, కోవిడ్ రోగుల చికిత్స కోసం 2వేలకు పైగా వెంటిలేటర్‌ బెడ్లను రిలయన్స్ పంపిణీ చేసినట్లు తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube