డెల్టా పంజా : అగ్ర రాజ్యంలో హాస్పిటల్స్ హౌస్ ఫుల్...!!

అగ్ర రాజ్యం అమెరికాపై డెల్టా వేరియంట్ విశ్వ రూపం చూపిస్తోంది.కరోనా మొదటి వేవ్ కంటే కూడా ప్రస్తుత థర్డ్ వేవ్ డెల్టా అందరిలో దడ పుట్టిస్తోందట.

 Cdc Warns Americans About Delta Variant,  Americans, Anthony Fauci, Anthony Fauc-TeluguStop.com

అమెరికాలో కరోనాను తరిమి తరిమి కొడుతామని ప్రకటించిన బిడెన్ డెల్టా దెబ్బకు చేతులు ఎత్తేస్తున్నారు.మాస్క్ రహిత అమెరికాగా ప్రకటించిన కొన్ని రోజులలోనే మళ్ళీ మాస్క్ లు పెట్టుకోవాలంటూ ప్రాధేయ పడటమే కాకుండా గతంలో సడలింపులు ఇచ్చిన ప్రదేశాలలో సైతం మాస్క్ తప్పని సరి చేశారంటే అమెరికాలో డెల్టా ప్రభావం ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

కరోనా మొదటి వేవ్ లో అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో రానున్న రోజుల్లో డెల్టా అలాంటి ప్రభావాన్నే చూపనుందని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చేసిందని తెలుస్తోంది.

రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అమెరికా సిడీసి ఆదేశాలు జారీ చేసింది.

డెల్టా వేరియంట్ ముఖ్యంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై తన పంజా ఘులిపిస్తోంది.మొదటి వేరియంట్ సమయంలో ఫ్లోరిడాలో ఒక్క జులై నెలలో 10, 170 కేసులు నమోదు అయ్యాయని ఇప్పుడు ఇదే జులై నెల థర్డ్ వేరియంట్ సమయంలో 10, 207 కేసులు నమోదు అయ్యాయని అమెరికా ఆరోగ్య మానవ సేవల విభాగం ప్రకటించింది.ఇదిలాఉంటే

Telugu Americans, Anthony Fauci, Anthonyfauci, Cdcwarns, Covid, Delta Threat-Tel

అమెరికాలో మిగిలిన రాష్ట్రాల పరిస్థితి దారుణంగా మారుతోంది.కేసులు అధికంగా పెరగడంతో ఐసియూలలో ఖాళీలు లేక హాలులోనే బెడ్స్ వేసి రోగులకు సేవలు అందిస్తున్నారు.అయితే ఈ ప్రభావం ఇలానే కొనసాగితే అమెరికాలో పరిస్థితులు చేయి దాటే అవకాసం ఉందని మరో సారి లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదని అంచనా వేస్తున్నారు.అయితే ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ మాత్రం అమెరికాలో లాక్ డౌన్ పెట్టె అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

ప్రజలు అందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube