ఇంటర్‌లో అదరగొట్టిన పేదింటి అమ్మాయి.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే..?

ఈ జనరేషన్‌కు మనం తప్పకుండా ఇవ్వాల్సింది నాణ్యమైన విద్య మాత్రమేనని పెద్దలు చెప్తుంటారు.విద్యను ఎవరూ దోచుకోలేరు కాబట్టి విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని వారు అంటుంటారు.

 The Poor Girl Who Got Success In The Inter What If She Knows The Background, Poo-TeluguStop.com

ఈ క్రమంలో చదువు గొప్పతనం గురించి ప్రతీ ఒక్కరికి తెలిపేందుకుగాను ప్రభుత్వంతో పాటు ప్రముఖులు ప్రచారం చేస్తూనే ఉన్నారు.కాగా, క్రమశిక్షణ, పట్టుదలకు కృషి తోడైతే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించొచ్చని ఇప్పటికే చాలా మంది ప్రూవ్ చేశారు.

మనం ఇప్పుడు తెలుసుకోబోయే స్టోరీ ఆ కోవకు సంబంధించినదే.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చెందిన 18 ఏళ్ల ఐరమ్ తాను సరస్వతీ దేవిని అని నిరూపించుకుంది.

పూల్ చంద్ నారి శిల్ప బాలికల కాలేజ్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.ఈమె తండ్రి ఆటో డ్రైవర్.కాగా, వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.తనకొచ్చే కొద్ది పాటి డబ్బులతోనే పిల్లలను చదివిస్తున్నారు.

ఈ క్రమంలో ఆటో డ్రైవర్ కూతురు అయిన ఐరమ్ తండ్రిపేరును నిలబెట్టింది.చదువకు ఎకానమిక్ కండిషన్స్ అడ్డు కాదని ప్రూవ్ చేసింది.

ఇంటర్‌లో 98 శాతం మార్క్స్ సాధించి ఆదర్శంగా నిలిచింది.బయోలజీ సబ్జెక్ట్‌లో 99 శాతం మార్క్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

మొత్తంగా తనకు మాత్రమే కాదు తాను ఉంటున్న ప్రాంతానికి పేరు తీసుకొచ్చింది ఐరమ్.

Telugu Auto, Inter, Iram Thanu, Irfan Ahmed, Poor, Uttarakhand-Latest News - Tel

తను డాక్టర్ కావాలనుకుంటున్నానని, ఇందుకుగాను నీట్ ప్రిపేర్ అవుతున్నట్లు ఐరమ్ తెలిపింది.తనకు ఆర్థిక సాయం చేసిన టీచర్స్‌కు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఐరమ్ పేర్కొంది.తన పిల్లలెవరూ భవిష్యత్తులో ఆటో నడపబోరని తనకు గర్వంగా ఉందని ఐరమ్ ఫాదర్ ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు.

తన పిల్లలకు మంచి విద్య అందించేందుకు‌గాను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ అహ్మద్.పిల్లలకు మంచి చదువులు చదివించేందుకుగాను తను మారుమూల గ్రామం నుంచి డెహ్రాడూన్‌కు వచ్చానని ఇర్ఫాన్ అహ్మద్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube