అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ లో లక్ కలిసి రావట్లేదని చెప్పాలి.స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే అమ్మడు కెరియర్ పరంగా వెనకపడ్డది.
ఇన్నాళ్లు గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి ఇక మీదట ఆ హద్ధులు చెరిపేస్తూ ఎలాంటి పాత్రలకైనా సరే నేను రెడీ అనేస్తుంది.అంతేకాదు దర్శక నిర్మాతలకు ఈ మేరకు హింట్ కూడా ఇచ్చేస్తుందని తెలుస్తుంది.
అందం, అభినయం రెండు ఉన్న లావణ్య త్రిపాఠికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.యువ హీరోల సరసన జోడీ కడుతున్నా సరే ఆ సినిమాలు పెద్దగా ఫలితాలు అందించట్లేదు.
అందుకే అమ్మడు ఇప్పుడు స్టార్స్ మీద దృష్టి పెట్టింది.
స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చేలా డైరక్టర్, ప్రొడ్యూసర్స్ కు టచ్ లో ఉంటుంది.
స్టార్ సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా చేస్తా అంటుంది.అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా రెచ్చిపోయేందుకు రెడీ అని చెబుతుందట.
ఇక మీదట అన్ని పాత్రలు చేస్తానని అంటుంది.స్కిన్ షోకి ఇన్నాళ్లు కండీషన్స్ పెడుతూ వచ్చిన అమ్మడు ఇక మీదట రెచ్చిపోయేందుకు కూడా వెనక్కి తగ్గేది లేదని అంటుందట.
ఇన్నాళ్లు ఫోటో షూట్స్ లోనే తన గ్లామర్ సైడ్ చూపించిన లావణ్య త్రిపాఠి రెడీ అంటుంది.మరి ఇక మీదట అయినా అమ్మడి కెరియర్ స్వింగ్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.