పెన్ హాస్పిటల్ గురించి విన్నారా.. ఇక్కడ పెన్ లకు రిపేర్ చేస్తారట!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాతకాలం ఆలోచనలను పక్కన పెట్టి కొత్త విధానాలను అవలంభించు కుంటున్నాము.ఇది వరకు రోజుల్లో వాడే వస్తువులను, వాడే పద్దతులను మార్చుకుంటూ టెక్నాలజీని స్వాగతిస్తూ వస్తున్నాం పాతకాలం రోజుల్లో మన పెద్దవారు పెన్నులను వాడి పడేసేవారు కాదు.

 Famous Pen Hospital In Srikakulam, Srikakulam Pen Hospital, Srikakulam, Pen Hosp-TeluguStop.com

మళ్ళీ వాటిల్లో ఇంక్ నింపి వాటినే వాడేవారు.అలా సంవత్సరాలు తరబడి అదే పెన్నులను ఉపయోగిస్తూ ఉండేవారు.

కానీ ఇప్పుడు మనం మాత్రం యూస్ అండ్ త్రో పద్దతిని అవలంభిస్తున్నాం.ఏ వస్తువునైనా ఇలా వాడడమే అలవాటు చేసుకున్నాం పెన్నులు కూడా అంతే ఇది వరకటిలా పెన్నులను ఇంక్ నింపి మరి మళ్ళీ వాడడం ఎప్పుడో మానేశారు ఇప్పుడు వచ్చే పెన్నులన్నీ అలా వాడేసి ఇలా పడేసేవే ఇప్పుడు ఉన్న యువత ఏదైనా వస్తువు పాడైతే బాగుచేయించుకుని మరి వాడడం లేదు వెంటనే ఆ వస్తువు స్థానంలో కొత్త మోడల్ వచ్చేస్తుంది.

అలాంటిది పెన్నులు పాడైతే బాగుచేయించు కుంటామా లేదు కదా కానీ పెన్నులు బాగుచేసేందుకు కూడా హాస్పిటల్ ఉందని మీకు తెలుసా.ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా నిజం.

పెన్ బాగుచేసేందుకు ఒక హాస్పిటల్ ను పెట్టారు.అది శ్రీకాకుళంలో ఉంది.ఇందులో పెన్నులు కూడా అమ్ముతారు.2 రూపాయల పెన్నుల దగ్గర నుండి 20 వేలఖరీదైనవి కూడా ఇక్కడ దొరుకుతాయి.

Telugu Pen, Pen Srikakulam, Srikakulam, Time Repair, Pens, Penrepairs, Srikakula

అక్కడ ఆ షాప్ లో కొనే పెన్నులకు ఏదైనా రిపేర్ వస్తే వాళ్లే లైఫ్ టైం ఫ్రీ గా రిపేర్ చేస్తారు.ఈ పెన్నుల షాప్ ను వాళ్ళ పూర్వికులు పెట్టగ ఇప్పటికి అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ షాప్ లో పెన్నులను ప్రొఫెషనల్ గా క్లీన్ చేయడం, ఇంక్ నింపడం వంటివి చేస్తుంటారు.ఇక్కడ పెన్నులకు అవసరమయ్యే అన్ని వస్తువులు దొరుకుతాయి.

Telugu Pen, Pen Srikakulam, Srikakulam, Time Repair, Pens, Penrepairs, Srikakula

అయితే వీళ్ళు పెన్నుల మరమ్మతులకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటారు.ఇంకా ఎక్కువ అస్సలు తీసుకోరు.అక్కడ స్థానికంగా వీళ్ళ షాప్ కు మంచి పేరు ఉంది.అందుకే ఆ పేరును అలా నిలుపుకునేందుకు సర్వీస్ చార్జెస్ వంటివి తీసుకోము అని షాప్ యజమాని చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube