అంతరిక్షానికి వెళ్లాలనుకుంటున్నారా? వెంటనే సీటు రిజర్వ్ చేసుకోండి మరీ..

చాలా మందికి అంతరిక్షానికి వెళ్లాలనేది ఓ కల.అయితే, ఆ కల సాకారం చేసుకునేది కొద్ది మంది మాత్రమే.

 Want To Go Into Space? Reserve A Seat Immediately Too , Space, Want To Go Into S-TeluguStop.com

ఇటీవల అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ కూడా స్పేస్ టూర్ వెళ్లొచ్చారు.కాగా, ఇప్పుడు మీరు కూడా అంతరిక్షం వరకు పయనించొచ్చట.ఏంటి? నిజమేనా మీరు చెప్పేది? అని మీకు అనుమానం రావచ్చు.మీ అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు మిమ్మల్ని అంతరిక్షం వరకు తీసుకెళ్లేందుకు ఫ్లోరిడాలోని ఓ టూరిజం సంస్థ ముందుకు వచ్చింది.

అయితే, ఇక్కడ ఆస్ట్రోనాట్ల మాదిరిగా వెహికల్స్ లేదా రాకెట్‌లో కాదండోయ్.పయనం.ఇదో డిఫరెంట్ జర్నీ.ఎలాగో తెలుసుకోవాలనుందా? అయితే, ఈ స్టోరీని పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోండి మరి.

భూమ్మీద నుంచి మనుషులను బెలూన్‌లో అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు ఫ్లోరిటా టూరిజం సంస్థ ముందుకొచ్చింది.కేవలం రెండు గంటల్లోనే ఈ స్పేస్ బెలూన్ టేకాఫ్ అయి మిమ్మల్ని స్పేస్‌లో ఉంచనుంది.

ఈ షికారులో ప్రయాణికులకు ఆహారాన్ని టూరిజం సంస్థ వారే అందిస్తారు.ఇక ఈ బెలూన్ తిరిగి నేల మీద ల్యాండ్ కావడానికి మరో రెండు గంటలు పడుతుంది.

అయితే, ఈ జర్నీ చేయడానికి కేవలం 8 మంది మాత్రమే చేయొచ్చు.ఈ షికారును మీరు కూడా ఎంజాయ్‌ చేయొచ్చండి.అందుకు మీరు రూ.93 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.అయితే, అలా డబ్బులు చెల్లించి సీట్‌ బుక్‌ చేసుకున్నంత మాత్రాన మీరు వెంటనే స్పేస్ టూర్‌కు వెళ్లబోరు.

2024 వరకు ఆగాల్సిందే.

అయితే, హైడ్రోజన్‌ బెలూన్‌లు భూమ్మీద నుంచి అంతపైకి ఎగరగలవా? అని అనుమానం రావొచ్చు.కానీ, ఎగరగలవని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి లైట్ వెయిట్‌తో వెరీ లాంగ్ జర్నీ చేయగలిగే బెలూన్స్ రూపొందించారు.ఆ సిస్టమ్ ఉపయోగించే తాజాగా ఫ్లొరిడాలోని ఓ సంస్థ అంతరిక్షంలోకి బెలూన్ జర్నీ ప్లాన్ చేసింది.

బెలూన్ మాదరి ఉండే ఈ ప్లేన్‌లో ఒక స్పేస్‌ పైలట్, ఒక కో పైలట్‌ ఉంటారు.ఇక అంతరిక్ష అందాలను, మధుర క్షణాలను మీరు మీ మొబైల్ ఫోన్ లేదా కెమెరా ద్వారా రికార్డు కూడా చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube