ఈ స్పూన్ చూసారా..90 పైసల స్పూన్ 2 లక్షలకు కొన్నారు.. ఎందుకంటే?

కొంతమంది కొన్ని వస్తువులను ఎందుకు కొంటారో కూడా తెలియదు.కొన్ని ఎంత దార ఉన్న కూడా కొనడానికి మొగ్గు చూపారు.

 90 Paisa Spoon Sold For Rs 2 Lakhs In Online Auction In London, A 90 Paisa Spoon-TeluguStop.com

కానీ మరికొన్ని వస్తువులకు మాత్రం అసలు విలువు లేకపోయినా వేలు.లక్షలు పెట్టి మరి కొంటారు.

తాజాగా అలానే ఒక వ్యక్తి 90 పైసలు విలువ చేసే ఒక స్పూన్ ను 2 లక్షలు పెట్టి మరి వేలం పాటలో సొంతం చేసుకున్నాడు.

అంత పెట్టాడంటే ఆ స్పూన్ ఎదో విలువైనది అనుకునేరు.

అలా ఏమీ కాదు.ఈ స్పూన్ ఎప్పటిదో పాత కాలం నాటిది.

చూడడానికి కూడా సొట్టలు పడి మొత్తం వొంగిపొయి ఉంది.కానీ అతడు మాత్రం ఆ స్పూన్ ను లక్షలు పోసి కొన్నాడు.

ఆన్ లైన్ లో జరిగిన వేలం పాటలో పోటాపోటీ పెట్టుకొని మరి ఆ స్పూన్ ను దక్కించుకున్నాడు.అతడిది లండన్.

ఆ స్పూన్ ను ఒక వ్యక్తి 90 పైసలు పెట్టి కొన్నాడు.దానిని వేలంలో పెట్టి 2 లక్షలకు అమ్ముకున్నాడు.ఆ స్పూన్ 13 వ దశాబ్దానికి చెందిన అరుదైన వస్తువుగా గుర్తించారు.ఇది 5 ఇంచుల పొడవు ఉంది.

సోమర్సెట్ లోని లారెన్సేస్ ఆక్షవీర్ సంస్థ ఈ వేలం పాట నిర్వహించింది.ఆ వేలం లో పాల్గొన్న ఒక వ్యక్తి ఈ స్పూన్ ను 1,97,000 చెల్లించి మరి ఈ స్పూన్ ను సొంతం చేసుకున్నాడు.

ఇది పాతకాలం నటి స్పూన్ అవ్వడంతో ఈ స్పూన్ ను కొనేందుకు పోటీ పడ్డారు.చివరకు ఒక వ్యకి దాదాపు 2 లక్షలు పెట్టి ఈ స్పూన్ ను కొన్నాడు.అయితే ఈ స్పూన్ ఓనర్ ఈ స్పూన్ అంత రేట్ పలికే సరికి ఆనందంగా ఫీల్ అయ్యాడు.90 పైసలు పెట్టి కొన్న స్పూన్ అతడికి 2 లక్షలు తెచ్చిపెట్టిందని తెలిసి అతడి కుటుంబం కూడా షాక్ అయ్యారు.చూసారుగా అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube