వైరల్ వీడియో.. విమానంలో సిగరెట్ తాగుతూ నిద్రపోయాడు.. చివరికి..!

విమానం ఎక్కినప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా అది పెద్ద అనర్ధానికి దారి తీస్తుంది.అందులో ఉన్న అందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

 Man Lights Cigarette On Flight, Makes Passengers Furious, Video Of Flight, Cigar-TeluguStop.com

అందుకే విమానం ఎక్కే ముందు ఎయిర్ హోస్టర్స్ అందరి ప్రయాణికుల దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుని లోపలి పంపిస్తారు.విమానంలో ఉన్నంత సేపు కనీసం ఫోన్ కూడా ఆన్ చేయడానికి ఒప్పుకోరు.

అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా సిగెరెట్ తాగేశాడు.

ఒక వ్యక్తి సిగెరెట్ తాగిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

అతడు విమానంలో సిగెరెట్ తాగినందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.సిగెరెట్ తాగేవారికి అది ఒక వ్యసనంలా మారిపోతుంది.ఎప్పుడు తాగాలని మనసు పీకుతోంది.అలానే అతడు కూడా ఎక్కడ ఉన్నది మర్చిపోయి విమానంలోనే సిగెరెట్ తాగాడు.

ఈ తతంగాన్ని అంత పక్కన ఉన్న ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

ఇదంతా స్పిరిట్ ఎయిర్లైన్స్ విమానంలో జరిగింది.అయితే ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు.2019 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.అతడు సిగెరెట్ వెలిగించి ఒక్కసారి పొగ వదిలి అలానే నోట్లో పెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు.దాంతో తోటి ప్రయాణికులంతా ఆగ్రహించి కంప్లైంట్ ఇచ్చారు.

వెంటనే ఫ్లయిట్ అటెండెంట్ కు చెప్పడంతో వారు అక్కడికి వచ్చి విమానంలో సిగెరెట్ తాగకూడని తెలియదా అని వార్ణింగ్ ఇచ్చి సిగెరెట్ ట్రే లో పడేసారు.తలంతా పట్టేసిందని తాగానని చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా విస్తు పోయారు.

అతడు విమానం దిగిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేసారు.విమానంలో సిగెరెట్ తాగడం వల్ల స్మోక్ డిటెక్టర్లు వెంటనే ఆక్టివేట్ అయ్యి పైలెట్ కు తెలియజేస్తాయి.

అంతేకాదు అగ్నిప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.అందుకే అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube