ఇకపై ఆ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసే అవకాశం..!

ప్రపంచంలోకి కరోనా మహమ్మారి ఎంట్రీ వచ్చిన తర్వాత అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలలో అనేక మార్పులు రావడం గమనించాం.అంతేకాకుండా ప్రతి ఒక్కరి జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి.

 No Longer Do Those Employees Have The Opportunity To Work From Home Permanently,-TeluguStop.com

ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ఉద్యోగులపై పడడం, కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో చాలా కంపెనీలు కూడా వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టాయి.దాదాపు 2 సంవత్సరాలుగా చాలా కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అమలు చేస్తూ వచ్చాయి.

ఇక మరికొన్ని పెద్ద కంపెనీలు అయితే ఏకంగా శాశ్వతంగా ఇదే సౌకర్యాన్ని కల్పించేందుకు ముందుకు అడుగులు వేస్తూన్నాయి.

తాజాగా ఈ లిస్టులో కి ప్రముఖ జాబ్ పోర్టల్ సంస్థ లింక్‌ డిన్‌ కూడా చేరిపోయింది.

మైక్రోసాఫ్ట్ సంస్థతో అనుబంధం అయిన ఈ కంపెనీ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రొం హోమ్ సదుపాయాన్ని ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా వారి ఉద్యోగుల కోసం వారికి నచ్చిన పని అవకాశాన్ని ఎంచుకునే లాగా ఆప్షన్లు కూడా ప్రవేశ పెట్టపోతుంది.

అలాగే వారి ఉద్యోగుల కోసం సమయానికి అనుకూలంగా పార్ట్ టైం జాబ్ లాగా ఆఫీసుకు వచ్చి పని చేసుకునే అవకాశాన్ని కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో దాదాపు 16 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరైనా సరే ఉద్యోగులు వారి నివాసాన్ని మారిస్తే మాత్రం ఆ ప్రాంతానికి అనుగుణంగా వారి జీవితాల్లో కాస్త మార్పులు చేపట్టబోతున్నట్లు లింక్‌ డిన్‌  సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు చాలా మంది ఉద్యోగులు ఆఫీస్ లకు వెళ్లి పని చేసేందుకు కాస తక్కువ మక్కువ చూపుతున్నారే చెప్పాలి.

చూడాలి మరీ ఇంకా ఎన్ని కంపెనీలు ఇలాంటి వాటిని కొనసాగిస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube