' లెక్క ' చిక్కుల్లో వీర్రాజు ? 

చాలా రోజులుగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సైలెంట్ గా ఉంటున్నారు.గతంలో ఉన్నంత ఉత్సాహం కనిపించడం లేదు.

 Ratnaprabhas Letter To Somu Weeraraj On Election Expenses Ap Bjp, Bjp, Rathnapra-TeluguStop.com

దీనికి కారణం సోము వీర్రాజు స్థానంలో వేరొకరిని అధ్యక్షుడుని  చేయబోతున్నారని, వీర్రాజు వైసీపీ పై విమర్శలు చేస్తున్నా, మొహమాటం గానే చేస్తున్నారని, బిజెపి మిత్రపక్షంగా ఉన్నా, జనసేన ను కలుపుకు వెళ్లేందుకు వీర్రాజు ఆసక్తి చూపించడం లేదని, అందుకే ఆయనను మార్చి వేరొకరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అని చూస్తున్నట్టుగా ప్రచారం ఉధృతం కావడంతో, వీర్రాజు కాస్త డోస్ పెంచి వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత తన పంథా మార్చుకున్నారు.

ఇక అంత సెట్ అవుతుంది అనుకున్న సమయంలో ఆయనకు పెద్ద కష్టం వచ్చి పడింది.

ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను బిజెపి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

ఆమెకు తిరుగు లేదని బిజెపి నేతలు భరోసా ఇచ్చారు.స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారం చేయించారు.అయితే ఆమె మూడో స్థానానికి పరిమితం అయిపోయారు.ఇక్కడ గెలుపు కోసం భారీగా సొమ్ము ఖర్చు పెట్టినా, ఓటమి రత్నప్రభ ను పలకరించింది.

ఇక ఎన్నికలు తంతు ముగిసిపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Telugu Ap Bjp, Ap Cm, Jagan, Janasena, Pavan Kalyan, Rathnaprabha, Somu Verraju,

కనీసం పట్టించుకునేవారే ఇప్పుడు బిజెపి లో కరువవడంతో, ఆమె తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట.అయితే ఇప్పుడు ఆమె వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.దీనికి కారణం ఎన్నికల ఖర్చే.

తిరుపతి ఎన్నికల నిమిత్తం పార్టీ నుంచి 25%, పారిశ్రామికవేత్తల నుంచి 30% వచ్చిందని , మిగతా అంతా రత్నప్రభ స్వయంగా తన సొమ్ము ఖర్చు పెట్టారనే విషయం బయటకు వచ్చింది.అయితే అప్పట్లో సోము వీర్రాజు రత్నప్రభ ను ఉద్దేశించి ఓడిపోయే ప్రసక్తేలేదని, అలా అనుకుంటే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన మీ సొమ్మును రాబట్టే బాధ్యత నాది అంటూ సోము వీర్రాజు హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు గుర్తు చేస్తూ రత్నప్రభ ఎన్నికల ఖర్చు మొత్తం లిస్ట్ రూపంలో వీర్రాజుకి పంపినట్లు తెలుస్తోంది.

తాను దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ వీర్రాజు నుద్దేశించి లేఖ రాయడం, అది కాస్త బయటకు లీక్ కావడంతో ఇప్పుడు బిజెపిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube