వైరల్.. ఆ అందమైన దీవి శవాల దిబ్బగా ఎందుకు మారిందో తెలుసా..?

ఆ దీవి చూడడానికి చాలా అందంగా ఉంటుంది.అక్కడ ప్రజలు నివసించడానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి.

 Most Haunted Island In The World , Venice, Poveglia Island, Poveglia, Most Haunt-TeluguStop.com

కానీ ప్రజలు ఆ దీవి లోకి అడుగు పెట్టేందుకే బయపడి పోతున్నారు.పర్యాటక పరంగా కూడా మంచి అనుకూల మైన ప్రదేశం.

కానీ ఆ దీవిలోకి వెళ్లేందుకు ప్రభుత్వాలు కూడా సాహసించడం లేదు.మాములు ప్రజలకు దైర్యం చెప్పాల్సిన ప్రభుత్వమే బయపడి వెనకడుగు వేస్తే ఇక ప్రజలు కూడా ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు.

అసలు అంత అందమైన దీవి అంటున్నారు.అలాంటప్పుడు ప్రజలు ఎందుకు భయపడుతున్నారా.అని ఆలోచిస్తున్నారా.అందుకు కూడా ఒక కారణం ఉంది.

ఈ అందమైన దీవి వెనీస్ నగరానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఈ దీవి పేరు ”పోవెగ్లియా”.

ఈ అందమైన దీవిని శవాల దిబ్బగా పిలుస్తారు.అయితే ఇక్కడ స్మశానం మాత్రం లేదు.

కానీ దీనిని శవాల దిబ్బగానే అక్కడి ప్రజలు వర్ణిస్తారు.

ఎందుకంటే.16 దశాబ్దంలో సుమారు లక్షమంది ప్లేగు వ్యాధి రోగులు ఈ ప్రాంతంలో మరణించారట.అప్పుడు భయంకరమైన ప్లేగు వ్యాధి సోకి ప్రజలు చనిపోతుంటే అక్కడి ప్రభుత్వం ప్లేగు వ్యాధి సోకినా వారిని ఈ దీవిలోకి తెచ్చి పడేశారట.

వాళ్ళు వైద్యం అందక.ఆకలికి అక్కడే ఆర్తనాదాలు చేస్తూ చనిపోయారట.కానీ ప్రభుత్వం కూడా ఏమి చేయలేక పోయింది.వారిని అక్కడ ఉంచితే మరింత మందికి సోకుతుందని అందరిని ఆ దీవిలో వదిలిపెట్టారు.

ఆ తర్వాత ఆ దీవికి ప్రజలు వెళ్లేందుకు ఇష్టపడకపోతే ఆ దీవిలో మెంటల్ ఆసుపత్రి నిర్మించారు.కానీ ఆ హాస్పిటల్ లో ఒక డాక్టర్ అక్కడి రోగుల మీద రకరకాల ప్రయోగాలు చేయడంతో వారు చనిపోయేవారు.

ఆ తర్వాత ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెబుతున్నారు.అయితే అతడు ఆత్మహత్య చేసుకోలేదని అతడు చంపినా రోగులు ఆత్మలుగా మారి ఆ డాక్టర్ ను చంపేశాయని ప్రజలు చెబుతున్నారు.

Telugu Island, Poveglia, Poveglia Island-Latest News - Telugu

ఏది ఏమైనా ఆ తర్వాత దీనిని పర్యాటక పరంగా అభివృద్ధి చేద్దామని ప్రభుత్వాలు ముందుకు వచ్చినా ఆ దీవిలో ఎక్కడ తవ్వుతున్న సవాలు బయట పడడంతో ఆత్మలు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఆ దీవిలోకి ప్రజలు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి నిషేదించింది.కానీ కొంతమంది అనుమతి తీసుకుని వెళ్లినా ఆ తర్వాత వారి కోసం గాలిస్తే శవాలుగా మారిపోయారని అందుకే ఆ దీవిలోకి అడుగు పెట్టడానికి ప్రజలు భయపడుతున్నారు.ఈ దీవికి సమీపంలో నివసించే ప్రజలు అక్కడి నుండి గట్టిగ శబ్దాలు వినిపిస్తున్నాయని తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube