కాలికి నల్లతాడు ఏ రాశి వారికి మంచిది...ఏ రాశివారు కట్టుకోకూడదో తెలుసా?

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది కాలికి నల్ల దారం కట్టడం మనం చూస్తుంటాము.ఇది కట్టడంవల్ల తమ పై ఎలాంటి ప్రభావం ఉండదని చాలా మంది భావిస్తారు.

 Did You Know Which Horoscope Person Will Tie Black Thread Horoscope, Black Threa-TeluguStop.com

అయితే ఇది ప్రస్తుత కాలంలో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.కొందరు సాధారణ దారాలను కాలికి కట్టగా మరికొందరు వీటికి వివిధ రకాల పూసలు జోడించి కాళ్లకు కడుతారు.

అయితే నల్ల దారం అనేది ప్రతి ఒక్కరికి సరిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పరు.కొన్ని రాశుల వారికి మాత్రమే నల్లతాడు కట్టడం వల్ల శుభం జరుగుతుందని, మరికొందరిలో ఈ నల్ల తాడు అశుభాన్ని కలుగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మరి నల్ల తాడు ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల తాడులో కేవలం ధనస్సు, తుల, కుంభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ రాశిచక్రాలలో పుట్టిన వారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును కట్టుకోవచ్చు.ఈ క్రమంలోనే వృశ్చిక రాశి, మేష రాశిలో జన్మించిన వారికి నల్ల తాడు కలిసిరాదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశిని, మేష రాశిని అంగారకుడు ఆదీనంలో ఉంటాయి కనుక ఈ రెండు రాశుల వారు నల్లతాడును కట్టుకోకూడదు.ఈ రాశుల వారు నల్ల తాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడు అశుభాలు, మనశ్శాంతి కరువవడం, అధిక ఆందోళనలు కలుగుతాయి.

నల్ల దారం ధరించేటప్పుడు చాలా మంది వారి ఇష్టానుసారంగా ధరిస్తుంటారు.అయితే నల్లతాడు ధరించేవారు తప్పకుండా మంచి సమయం చూసి ధరించాలి.ఈ నల్ల తాడును ధరించేటప్పుడు ముందుగా రుద్ర గాయత్రి మంత్రం పఠించండి ఈ విధంగా గాయత్రీ మంత్రం చదివిన తర్వాత దారం తొడగాలి.అయితే ఇంతకు ముందు మన చేతికి పసుపు లేదా ఎరుపురంగు దారాలు ఉంటే నలుపు దారాన్ని తొడగాల్సిన పనిలేదు.

ముఖ్యంగా నల్ల దారం కాలికి ధరించేవారు శనివారం ధరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.శనివారం శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు.శనికి నలుపు అంటే ఎంతో ఇష్టం కనుక శనివారం రోజు నలుపు దారాన్ని ధరిస్తూ రుద్ర గాయత్రి మంత్రం జపించడం వల్ల ఈ తాడుకు మరింత బలం కలిగి అన్ని శుభాలను కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube