సీక్రెట్ గా భర్త ఫోన్ లో మెసేజులు చదివిందని భార్యకి ఫైన్ విధించిన కోర్టు.. అలాగే శిక్ష కూడా...

మామూలుగా కొంతమందికి తమ విషయాల కంటే తమ పక్క వాళ్ళ విషయాలలో తలదూర్చడం అలాగే వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వంటి అలవాటు ఉంటుంది.అయితే తాజాగా ఈ అలవాటు ఓ వివాహిత కొంప ముంచింది.

 Uae Court Jails Woman For Secretly Reading Messages, Secretly Reading Messages,-TeluguStop.com

ఇందులో భాగంగా తన భర్త అనుమతి లేకుండా దొంగ చాటుగా మెసేజులను చదివిందని కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించిన ఘటన యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) దేశంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని “అబు దాబి” పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.కానీ తన ఇద్దరి భార్యలను వేరు వేరు ఇళ్ళల్లో ఉంచి కాపురం చేస్తున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో ఈ వ్యక్తి రెండో భార్యకి తన భర్తపై పలు అనుమానాలు కలిగాయి.దీంతో అప్పుడప్పుడు తన భర్త ఫోన్ తీసుకొని చాటుగా సందేశాలను చదివేది.

అంతేకాకుండా తన మొదటి భార్య చేసిన మెసేజులకు రిప్లై కూడా ఇచ్చేది.

Telugu Messages, Uae-Movie

దీంతో ఈ వ్యక్తి మొదటి భార్య తన భర్త పై కోపం పెంచుకుని పలుమార్లు గొడవలు కూడా పడ్డారు.దీంతో అసలు ఎందుకిలా జరుగుతోందని వ్యక్తి ఆరా తీసే పనిలో పడ్డాడు.ఈ క్రమంలో తన రెండో భార్య దొంగ చాటుగా మెసేజులు చదువుతుందని అంతేకాకుండా తనకు తెలియకుండా రిప్లై కూడా ఇస్తోందని తెలుసుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు నమోదు చేశాడు.దీంతో పోలీసులు భార్య భర్తలను కోర్టులో హాజరు పరచగా ఇతరుల అనుమతులు లేకుండా వారి యొక్క వ్యక్తిగత విషయాలలో తలదూర్చడం మరియు వారికి సంబంధించిన మెసేజీలు చూడడం, రిప్లై ఇవ్వడం వంటివి క్రిమినల్ యాక్ట్ కిందకు వస్తాయని మొదటిసారి కావడంతో 1.65 లక్షల రూపాయలు (ఇండియన్ కరెన్సీ లో) జరిమానా విధించడంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించింది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అలాగే ఈ విషయంపై కొందరు అధికారులు స్పందిస్తూ అనవసరమైన విషయాలలో తల దూర్చి చిక్కులు తెచ్చుకోవడమంటే ఇదేనంటూ వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube