ఈ సినిమా విడుదలైనప్పుడు బాగలేదన్నారు... కానీ 4 ఏళ్ల తర్వాత....

2017వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” దర్శకత్వం వహించిన “గౌతమ్ నంద” చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించి ద్వి పాత్రాభినయం చేయగా హీరోయిన్ గా హన్సిక మొత్వాని, క్యాథరిన్ తెరిసా తదితరులు నటించారు.

 Gowtham Nanda Movie Complete 4 Years, Gowtham Nanda, Complete 4 Years, Gopichand-TeluguStop.com

అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటులు ముకేశ్ రిషి, సచిన్ ఖేడేకర్, సీత, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, అన్నపూర్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే నాలుగేళ్ల క్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ చిత్రం టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెగ నచ్చుతోంది.

అయితే ఈ చిత్రం విడుదలయ్యి ఇటీవలే 4 సంవత్సరాలు పూర్తవడంతో చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ఇందులో భాగంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చిత్ర యూనిట్ సభ్యుల కి శుభాకాంక్షలు తెలియజేశాడు.అలాగే తాను ఈ చిత్రం విడుదలైనప్పుడు మొదటి రోజు మొదటి షోకి చికాగోలో తన కుటుంబ సభ్యులతో వెళ్లి చూశానని అప్పుడు తనకి ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని కానీ బయట మాత్రం ఫ్లాప్ టాక్ వినిపించిందని చెప్పుకొచ్చాడు.

కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ చిత్రం అండర్ రేట్, స్టైలిష్, సూపర్ కాన్సెప్ట్ అని పొగుడుతున్నారని కానీ తనకు ఈ విషయం ఏ మాత్రం అర్థం కావడం లేదని బహుశా విస్కీ మాదిరిగా ఏండ్లు గడిచే కొద్దీ టేస్ట్ మారినట్లు సినిమాలు కూడా రుచిగా మారుతాయేమో అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం “సంపత్ నంది” తెలుగులో “సిటీమార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ నటిస్తుండగా హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తోంది.కాగా ఈ చిత్రం కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా మంచి స్పందన లభించంది.అయితే దర్శకుడు సంపత్ నంది ఒకపక్క చిత్రాలకు దర్శకత్వం వహిస్తునే మరోపక్క పలు చిత్రాలకు కథలను అందిస్తున్నాడు.

అంతే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube