బిర్యానీ తెచ్చిన తంటాలు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు తప్పక చదవాల్సిందే..!

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మనుషుల జీవన శైలి పూర్తిగా మారిందన్న సంగతి ప్రతీ ఒక్కరు ఒప్పుకుంటారు.ఆహారపు అలవాట్ల నుంచి మొదలుకుని పనుల వరకు అన్నిటిలో గణనీయమైన మార్పులొచ్చాయి.

 Women Ips Officer Free Mutton Biryani Order, Women Ips Officer , Free Mutton Bir-TeluguStop.com

ఈ క్రమంలోనే బిర్యానీ అంటే దాదాపుగా అందరూ ఇష్టపడుతున్నారు.కాగా, ఈ బిర్యానీ ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌కు తలనొప్పి తెచ్చి పెట్టిందట.

ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అసలు బిర్యానీ తలనొప్పి ఎలా తెచ్చిపెట్టింది? అది ఐపీఎస్ అధికారిణికి అన్న అనుమానం మీకు రావొచ్చు.ఆ వివరాలు మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవితే కానీ అర్థం కాదు.ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి.

మహారాష్ట్రలోని విశ్రాంబాగ్ ప్రాంతానికి ఇటీవల డీసీపీ ర్యాంకున్న ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ వచ్చారు.ఇటీవల డ్యూటీ నిమిత్తం ఆమె హరీబరీగా ఆఫీసుకు రాగా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకురాలేదు.

ఈ క్రమంలోనే సబ్ ఆర్డినేట్‌తో మధ్యాహ్న భోజన విషయమై చర్చించింది.దగ్గర్లో మంచి బిర్యానీ ఎక్కడ దొరకుతుందని ప్రశ్నించింది.

విశ్రాంబాగ్ పీఎస్ పరిధిలోని దేశీ ఘీ రెస్టారెంట్‌లో బిర్యానీ బాగుంటుందని చెప్పగా, అక్కడి నుంచి మటన్ బిర్యానీ తీసుకురావాలని తెలిపింది.ఈ క్రమంలోనే డబ్బుల విషయమై రెస్టారెంట్ వాళ్లు అడిగితే స్థానిక ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడించండి అని చెప్పింది.

ఈ మేరకు ఆమె సంభాషణలు జరిపినట్లు ఆడియో క్లిప్పింగ్ స్థానికంగా సంచలనంగా మారింది.ఆమెకు లేనిపోని తలనొప్పి తెచ్చి పట్టింది ఈ ఆడియో.

అయితే, సదరు ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని అధికారిణి పేర్కొంటోంది.తన వాయిస్‌తో మిమిక్రీ చేసి లేదా మార్ఫింగ్ చేశారని ఆమె చెప్తోంది.

ఈ క్లిప్పింగ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పజెప్పాలని అక్కడ నిజానిజాలు బయటపడతాయని తెలిపింది.కాగా, ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయి హోం మంత్రి వరకు వెళ్లింది.

దాంతో ఈ విషయమై విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని హోం మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.మొత్తంగా బిర్యానీ గురించి సదరు అధికారిణి అడిగిందో లేదో తెలియదు.

కానీ, ఆమెకు తంటాలను అయితే తెచ్చి పెట్టిందనే చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube