వాలి ఎవరి అనుగ్రహం చేత పుట్టాడు.. వాలి జన్మ రహస్యం ఏంటో తెలుసా?

రామాయణం మనకు వాలి పాత్ర గురించి వివరించింది.రామాయణంలో రాముడు స్వయంగా వాలిని ఏవిధంగా మట్టికరిపించాడు అనే విషయాన్ని అద్భుతంగా తెలియజేసింది.

 What Is The Secret Behind The Birth Of Vali In Ramayana, Vali Birth, Rama, Faced-TeluguStop.com

సాక్షాత్తు రావణాసురుడు అంతటివాడే వాలిని చేయించలేక అతనితో రాజీ కుదుర్చుకుంటాడు.ఎంతో పరాక్రమశాలి అయిన రాముడు కూడా వాలిని ఎదిరించలేక దొంగచాటుగా అతనిని చంపాడు.

ఎలాంటి యోధుల నైనా వారి శక్తిని హరించే వరం వాలికి ఉంది.మరి వాలి ఎలా జన్మించాడు? వాలి జన్మ రహస్యం ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం

పురాణాల ప్రకారం చతుర్ముఖ బ్రహ్మ యోగ ముద్రలో ఉండగా కంటి నుండి నీరు వస్తుంది. తన కంటి నుంచి వచ్చిన నీటిని బ్రహ్మదేవుడు తన చేతితో తాకగా కన్నీటినుండి వృక్షకవజస్సు అనే వానరుడు జన్మిస్తాడు.ఈ క్రమంలోనే ఆ వానరుడు పండ్లు ఫలాలు తింటూ బతకమని బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు.

ఇలా పండ్లు ఫలాలు తింటూ ఉన్నటువంటి వానరుడు నీటి కోసం ఒక కొలను దగ్గరికి వెళ్తాడు.అయితే ఆ నీటిలో తన నీడ నన్ను చూసి తన పై దాడి చేయడానికి ఎవరో వస్తున్నారని తనతో పోటీ పడటం కోసం సరస్సులోకి దూకాడు.

అయితే ఆ సరస్సుకు పార్వతి దేవి శాపం ఉంటుంది.ఎవరైతే మగవారు ఆ సరస్సులో దూకుతారో వారు ఆడవారిగా మారిపోతారని శాపం కారణంగా వృక్షకవజస్సు అనే వానరుడు అందమైన స్త్రీ రూపం లోకి మారుతాడు.

Telugu Bane, Faced Brahma, Parvathi Devi, Rama, Rama Vali, Ravanasura, Telugu Bh

ఈ విధంగా స్త్రీ రూపంలోకి మారిన వృక్షకవజస్సుని చూసి సూర్యుడు, ఇంద్రుడు మోహిస్తారు.ఈ క్రమంలోనే ఇంద్రుడి తేజస్సును ఆమె తలపై వదిలితే అది వాలం వరకువెళ్లి వాలి జన్మిస్తాడు.అలాగే సూర్యుడు తన తేజస్సును కంఠం పై వదలటం వల్ల సుగ్రీవుడు జన్మిస్తాడు.ఈ విధంగా ఇంద్రుడు సూర్యుడు ఒక వానరం పై తమ తేజస్సును ప్రదర్శించడానికి గల కారణం ఉంది.లోక కల్యాణం కోసం విష్ణుమూర్తి రాముడు అవతారంలో జన్మించబోతున్నాడు.

Telugu Bane, Faced Brahma, Parvathi Devi, Rama, Rama Vali, Ravanasura, Telugu Bh

ఈ క్రమంలోనే రాముడుకు సహాయంగా ఉండటానికి గొప్ప యోధుల జన్మ క్షేత్రం అంతే గొప్పగా ఉండాలని వృక్షకవజస్సు గొప్పగా ఉండాలని బ్రహ్మదేవుడు ఇంద్రుడు సూర్యుడు ద్వారా వాలిని, సుగ్రీవుడిని భూమిపై జన్మించేలా చేశాడు.వాలి దుందుభి, మాయావి లాంటి పెద్ద పెద్ద రాక్షసులను సంహరించి రాముడికి సీత అన్వేషణలో ఎంతో సహాయం చేసి రాముడు చేతిలోనే ప్రాణాలను కోల్పోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube