వైరల్: నీటి బిందువులను బంగారంగా మార్చిన శాస్త్రవేత్తలు..!

బంగారానికి ఉన్న విలువ ఎప్పటికి పెరగడమే తప్ప తగ్గదు.ఎందుకంటే బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఎక్కువగానే ఉంటుంది.

 Scientists Turn Water Droplets Into Gold   Viral Latest, Viral News, Social Medi-TeluguStop.com

బంగారం ధర ఎంత ఉన్నాగాని దాన్ని కొనడం మాత్రం ఆపరు అంటేనే అర్ధం కావట్లేదా బంగారానికి ఎంత డిమాండ్ ఉందో అనే విషయం.అలాగే కొద్ది సేపు బంగారం విషయం పక్కన పెడితే మీకు ఒక షాకింగ్ విషయం కూడా చెప్పాలి.

అదేంటంటే కొందరు శాస్త్రవేత్తలు నీటిని కూడా బంగారంలాగా మార్చేశారు.నీరు ఎంత విలువ అయినదో మన అందరికి తెలుసు.

నీరు తాగకుండా మనిషి బ్రతకలేడు.అంతటి ప్రాధాన్యం ఉన్న నీరు ఇప్పుడు బంగారంలాగా మారిపోయింది.

ఏంటి షాక్ అయ్యార కానీ ఇది నిజం.ఇలా నీటిని బంగారంలాగా మార్చడం అనేది అంతా సులువుగా అయ్యే విషయం కాదు అంటున్నారు శాస్ర్రవేత్తలు.

ఈ పక్రియలో అన్నిటికంటే ముఖ్యమైనది ‘టైమింగ్’ అంటున్నారు ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు.నిజానికి నీరు అనేది లోహం కాదు.కానీ లోహాలు కానటువంటి చాలా వస్తువులను ఇప్పుడు లోహాలుగా మార్చి చూపించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఏ వస్తువులోని అణువులు, పరమాణువులను అన్నిటిని గ్యాప్ లేకుండా ఒక్కచోటకు చేర్చితే ఆ వస్తువు లోహంగా మారి, దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్ల సమూహం ఆ సమయంలో విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే ఇలా నీటిని లోహంగా మార్చాడానికి సుమారు కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమన అందుకే అంత మొత్తంలో పీడనం అవసరం లేకుండానే నీటిని లోహంగా మార్చవచ్చు అంటున్నారు చెక్ అకాడమీ సైన్సెస్ శాస్త్రవేత్తలు.ఇది ఎలా అంటే కొన్ని క్షార లోహాల నుంచి ఎలక్ట్రాన్ లను తీసుకుని వాటిని నీటిపై ప్రయోగిస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు.

పొటాషియం, సోడియం వంటి మూలకాలతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు కానీ ఈ ప్రక్రియ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలట.

Telugu Latest, Bubble-Latest News - Telugu

మూలకాలకు నీటి చుక్క తగిలితే మండే స్వభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పేలుళ్లు జరిగే ప్రమాదం ఉంది.అందుకే నీరు, ఆ మూలకాల మధ్య చర్యను చాలా నెమ్మదిగా చేసారు.అంటే ఒక సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకుని దానిని ఓ వాక్యూమ్ చాంబర్ లో పెట్టి ఆ సిరంజీ నుంచి మెల్లగా సోడియం, పొటాషియం ద్రావణం బిందువులను విడుదల చేసి నీటి ఆవిరితో చర్య జరిపేలా వారు చేశారు.

అప్పుడే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు కాస్త బంగారంగా మారి ఆ తరువాత మెరిసే లోహంగా మారిపోయింది.ఈ ప్రక్రియలో సమయానుకూలన పాటించడం చాలా ముఖ్యం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏది ఏమైనా ఇలా నీటి బిందువును బంగారంలో మార్చడం అంటే నిజంగా విడ్డూరమే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube