వైరల్ వీడియో: ఆకాశం నుండి జారువెళ్లిన ఫైర్ బాల్స్..!

మన అందరికి ఆకాశం నుండి వర్షం పడడం, మంచు గడ్డలు పడడం, పిడుగులు పడడం లాంటివి చాలానే చూసే ఉంటాం.కానీ.

 Viral Video Fireballs Slipping From The Sky , Viral Video, Social Media, Viral L-TeluguStop.com

అకాశం నుండి భారీ పరిమాణంలో అగ్నిగోళాలు భూమ్మీదకు జారి పడటం లాంటివి తెలియదు కదా.అయితే తాజాగా.అమెరికాలో చాలా చోట్ల అగ్ని గోళాలు భూమి మీదకు పడడం జరిగింది.వాటిని చూసి అమెరికా వాసులు భయ భ్రాంతులకు గురి అవుతున్నారు.ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని రీతిలో నిప్పులతో అగ్ని గోళాలు ఇలా కిందకు పడడం ఏంటి అని అమెరికాలోని టెక్సాస్ వాసులు ఒకింత షాక్ కు గురి అయ్యారు.కొంతమంది ఈ అగ్ని గోళాలు కిందకు పడడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఇలా అకాశం నుండి అగ్నిగోళాలు జారిపడటాన్ని ఉల్కాపాతం అని పిలుస్తారు.

ఈ ఉల్కలు అనేవి నక్షత్రాల్లో చిన్న సైజులో ఉండి అకాశం నుండి ఒక్కసారిగా జారి పడిపోతుంటాయి.

ఈ అగ్ని గోళాలు కిందకి పడే సమయంలో అవి బాగా కాంతిని వెదజల్లుతాయి.అమెరికాలో గత ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆకాశంలో అగ్ని గోళాలు కనిపించాయని అమెరికన్ ఉల్కాపాతం సొసైటీ ఏఎమ్ఎస్ తెలిపింది.

అమెరికా లోని ఒక్క టెక్సాస్ లో మాత్రమే కాకుండా మిస్పౌరీ, అర్కాన్సాస్ తో పాటు మరికొందరు ఆకాశం నుండి ఫైర్ బాల్స్ పడడం చూసారు.

Telugu Fireballs, Latest-Latest News - Telugu

ఇలా మొత్తంగా 213 ఫైర్ బాల్స్ అకాశం నుండి భూమిపైకి పడినట్లు ఏఎంఎస్ అంచనా వేస్తుంది.అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా కూడా అకాశం నుండి క్రిందికి పడ్డ అగ్ని గోళాలను ఉల్కాపాతంగానే గుర్తించింది.ఈ ఉల్కాపాతం వలన అమెరికాలో ఎలాంటి నష్టం అనేది కలగలేదనీ.

ఇలా ఆకాశం నుండి కిందికి ఫైర్ బాల్స్ జారడం కొత్తేమి కాదని ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ఉల్కలు జారిపడుతూనే ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.ప్రస్తుతం ఫైర్ బాల్స్ ఆకాశం నుండి కిందకి జారిపడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube