జక్కన్న తండ్రి ఆవిష్కరించిన 'చిత్రపటం' పాట

రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు దక్కించుకున్న బండారు దానయ్య కవి ఇది వరకే దర్శకుడిగా ఒక సినిమాను తెరకెక్కించారు.తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

 Vijayendra Prasad Release Chitrapatam Movie Song , Chitrapatam Movie , Chitrapat-TeluguStop.com

ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం చిత్రపటం . పార్వతీశం, శ్రీవల్లి లు ఈ సినిమాలో పాత్రధారులుగా కనిపించబోతున్నారు.శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ఈ చిత్రంలోని నింగిని చూసి నేర్చుకున్న అనే పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో విడుదల చేశారు.

అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు.తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ, ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే.దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం.తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది.

Telugu Bandarudanyya, Chitrapatam, Rajamouli, Tollywood, Vijandr Prasad-Movie

ఇందులో ఏడు పాటలు ఉన్నాయి.వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను.పొయెటిక్ గా ఉంటూనే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి అని అన్నారు.నిర్మాత పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ త్వరలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పారు.

దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా పాటను ఆవిష్కరిచడం వల్ల సినిమాకు ఒక్కసారిగా బజ్‌ క్రియేట్‌ అయ్యింది.ఇన్నాళ్లు పెద్దగా ఎవరు పట్టించుకోని చిత్రపటం గురించి ఇప్పుడు జనాలు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube