'లక్ష్య' కొత్త పోస్టర్ విడుదల.. నాగ శౌర్య కేతిక పెయిర్ సూపర్ !

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో నాగ శౌర్య ఒకరు.ఈయన ఛలో సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

 Hero Naga Shaurya Lakshya Movie New Poster, Naga Shaurya, Lakshya Movie, New Pos-TeluguStop.com

ప్రస్తుతం నాగ శౌర్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో లక్ష్య సినిమా ఒకటి.

విలు విద్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది.

త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

శుక్రవారం ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టు టీమ్ తెలిపారు.#LAKSHYASFRIDAY పేరుతొ ఈ అప్డేట్ ఉండబోతుందట.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ రోజు శుక్రవారం కావడంతో ఈ రోజు నుండే ప్రమోషన్స్ షురూ చేసారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ పోస్టర్ లో హీరో నాగ శౌర్య, హీరోయిన్ కేతిక శర్మ కనిపించరు.

కేతిక నాగ శౌర్య కు ముద్దు పెడుతుండగా ఉన్న పోస్టర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది.వీళ్ళ పెయిర్ చూడడానికి చాలా బాగుంది.నాగ శౌర్య లుక్ పరంగా కూడా కొత్తగా కనిపిస్తున్నాడు.ఇందులో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఆర్చరీ నేపథ్యంలో మొట్టమొదటి సినిమాగా లక్ష్య సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.నాగ శౌర్య ఈ సినిమాతో పాటు ‘వరుడు కావలెను‘ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ శౌర్య కు జోడీగా రీతూ వర్మ నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube