ఇక వాటికి చెక్ పెట్టబోతున్న గూగుల్..!

ప్రస్తుత ప్రపంచంలో గూగుల్ అంటే తెలియని వారు ఉండరు.ఇప్పుడు మనకు కావాల్సిన ఏ సమాచారం అయినా కూడా గూగుల్ ద్వారా సులభంగా కనుక్కోవచ్చు.

 Google, Check, 1000 Installation, 90 Days, Latest News, Viral,lates News-TeluguStop.com

చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ గూగుల్ వినియోగిస్తున్నవారు చాలా మందే ఉన్నారు.మనకు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా గూగుల్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.ఆండ్రాయిడ్‌ యాప్‌ లను క్రియేట్‌ చేసే డెవలపర్లకు గూగుల్ షాకింగ్ న్యూస్ చెప్పింది.

గూగుల్‌ ప్లేస్టోర్‌ లో కొన్ని లిస్టెడ్‌ యాప్‌ లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.గూగుల్‌ ప్లే స్టోర్‌ లో ఇన్‌ యాక్టివ్‌గా ఉన్న యాప్‌ లను, అలాగే చాలా రోజుల పాటు అప్డేట్‌ చేయకుండా ఉన్న యాప్‌ లను ఇక ఉండకుండా మొత్తం డిలీట్ చేసేయాలని గూగుల్ తెలియజేసింది.

గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2021వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేది నుంచి కొన్ని రకాల యాప్స్‌ ను గూగుల్ తొలగిస్తూ పోతుంది.ఈ ప్రక్రియను గూగుల్ ఇప్పటికే మొదలెట్టేసింది.

Telugu Days, Google, Latest-Latest News - Telugu

ఇనాక్టివ్ గా ఉండేటటువంటి యాప్‌ లను తొలగించడం వలన గూగుల్‌ ప్లే స్టోర్‌ అనేది శుభ్రం అవతుందని, అంతేకాకుండా ప్లే స్టోర్‌ భద్రత కూడా మరింత పఠిష్టంగా తయారవుతుందని గూగుల్ తెలియజేసింది.లోపాలు, బగ్‌ లు ఉండేటటువంటి అనేక యాప్స్ ను గూగుల్‌ ఎప్పటికప్పుడు తీసేయడం చాలా మంది పని అనే చెప్పొచ్చు.ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలపర్స్‌ యాక్టివ్‌ గా వారి యాప్‌ లను మెయిన్టెన్‌ చేస్తే వాటి జోలికి గూగుల్ వెళ్లదు.యాక్టివ్ గా ఉండే యాప్ లను గూగుల్‌ ప్లే అస్సలు డిలీట్ చేయదు.

గూగుల్ స్టోర్‌ లో యాక్టివ్‌ గా ఉండి, దాదాపుగా 1000కి పైగా ఇన్స్టాల్‌ కలిగి ఉన్న యాప్‌ లు, లేదా గత 90 రోజుల్లో ఇన్‌ యాప్‌ పర్చెస్‌ కల్గి ఉన్న యాప్‌ లను డిలీట్ చేయదని గూగుల్‌ స్వయంగా తెలియజేసింది.దీని వల్ల గూగుల్ యూజర్లకు కూడా ఎంతో మేలు కలగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube