వైరల్: మలద్వారం ద్వారా శరీరంలోకి ఈల్ చెపను పంపించుకున్న వ్యక్తి.. చివరకి..?

టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయినాగానీ మనుషులలో ముఢ నమ్మకాలు పోలేదు.అలాగే అంతు చిక్కని రోగాలకు కూడా వైద్యాన్ని కనిపెడుతున్న ఈ రోజుల్లో ఇంకా పాతకాలపు చిట్కాలు పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

 Viral: The Person Who Sent The Eel Into The Body Through The Anus Finally, Viral-TeluguStop.com

అయితే ఇలా ఒక వ్యక్తి మెడిసిన్ మీద ఆధారపడకుండా సొంతగా వైద్యం చేసుకుని తన సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నాడు.కానీ అది కాస్త విగటించి అతని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.

అసలు ఇంతకీ అతడు చేసిన పని ఏంటో తెలుసా.ఒక చేపను తన మలరంద్రంలోకి చొప్పించాడు.

ఏంటి షాక్ అయ్యారా.కానీ ఇది నిజంగానే జరిగింది.

అసలు ఆ వ్యక్తి అలా ఎందుకు చేసాడో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.

ఆ వ్యక్తి గత కొంత కాలంగా దీర్ఘకాలిక మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడట.

ఆ బాధ నుండి ఉపసమనం పొందడానికి ఇలా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తుంది.అసలు వివరాల్లోకి వెళితే.చైనాలోని జింగ్హువాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం తగ్గుతుందనే పిచ్చి నమ్మకంతో సుమారు 20cm పొడవు ఉన్న ఒక ఈల్ చేపను అతని మలద్వారం లోపలికి పంపించాడు.కానీ ఆ చేప మలద్వారం నుంచి పైకి వెళ్లి అతగాడి పొత్తి కడుపులోకి ప్రవేశించి పెద్ద పేగుకి రంధ్రం చేయడంతో కడుపులోనే తీవ్రంగా రక్తస్రావం అవ్వడంతో అతనికి భరించలేని నొప్పి రావడంతో అది తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్ళాడు.

Telugu Fish, Latest-Latest News - Telugu

జరిగిన విషయాన్నీ తెలుసుకుని వైద్యులు అతి కష్టం మీద శాస్త్ర చికిత్స చేసి అతడిని కాపాడారు.ఈ ఘటన పై ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.ఒకవేళ బాధితుడి పెద్ద ప్రేగులోని బ్యాక్టీరియా ఉదర కుహరానికి వెళ్ళినట్లయితే హీమోలైసిస్ వ్యాధి వచ్చి అతనికి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.ఎవరికీ వారు సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని వారు హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube