తెలుగులో ఒకప్పుడు తన జీరో సైజు నడుము అందాలతో కుర్రకారుని ఎంతగానో అలరించిన గోవా బ్యూటీ “ఇలియానా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే “దేవదాస్” చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవడంతో దాదాపుగా ఐదు సంవత్సరాల కాలం పాటు స్టార్ హీరోయిన్ గా నటించింది.
ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ తదితర స్టార్ హీరోల సరసన నటించింది.కానీ బాలీవుడ్ పై ఉన్నటువంటి మోజు కారణంగా టాలీవుడ్ ని పక్కన పెట్టి మూటా ముల్లె సర్దుకుని ముంబైకి వెళ్ళిపోయింది.
అయితే బాలీవుడ్ కి వెళ్ళిన కొత్తలో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
దీంతో కొంత కాలం పాటు సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టున ఖాళీగా గడిపింది.
ఈ క్రమంలో బరువు పెరిగి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.అయితే ఒకప్పడు తన జీరో సైజు నడుము అందాలతో ఎంతగానో ఆకట్టుకున్న ఇలియానా ప్రస్తుతం బరువు పెరిగి లావుగా తయారైంది.
దీంతో సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.దాంతో ఇలియానా మళ్లీ ఎలాగైనా సరే బరువు తగ్గి స్టార్ హీరోయిన్ గా రాణించాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
కాగా తాజాగా ఇలియానా బికినీ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
అంతేకాక తొందర్లోనే మళ్ళీ పాత రోజుల మాదిరిగానే రాణిస్తానని క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో ఇలియానా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 8 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.
దీన్ని బట్టి చూస్తే బరువు పెరిగినా ఇలియానాకి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గ లేదని స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో “ఆన్ ఫెయిర్ అండ్ లవ్లీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రంలో ఇలియానా కొంతమేర “డీ గ్లామరస్” గా కనిపించనున్నట్లు సమాచారం.కాగా ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “బల్విందర్ సింగ్” దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ “సోని పిక్చర్స్” నిర్మాతగా వ్యవహరిస్తోంది
.